- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
వారం రోజుల్లో 'దేవర' రిలీజ్.. పవన్ కళ్యాణ్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పిన NTR
దిశ,వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్(Jr. NTR) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్(Jr. NTR) హీరోగా కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’(Devara). ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు దేవర చిత్రం రానుంది.
ఈ నేపథ్యంలో ఏపీలో 'దేవర' సినిమా టికెట్ల(Movie tickets) ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం(AP Government) అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లలో(multiplexes) ఒక్కో టికెట్లపై రూ.135 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.60 వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. సినిమా రిలీజ్ రోజున (SEP 27) 12 AM నుంచి మొత్తం 6 షోలకు అనుమతి ఇచ్చిన సర్కార్.. 28వ తేదీ నుంచి 9 రోజుల పాటు రోజుకు 5 షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు
For Jr NTR tweet : https://x.com/tarak9999/status/1837402938777411592