- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RRR: ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ప్రశంసలు.. బాలీవుడ్ నుంచి నో రెస్పాన్స్!
దిశ, వెబ్ డెస్క్: బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటాగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డును సాధించి 140 కోట్ల మంది భారతీయులను సంబరాల్లో ముంచెత్తింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కానీ దేశం నుంచే మొట్టమొదటి సారిగా ఉత్తమ గీతంగా ఆస్కార్ గెలుచున్న ఆర్ఆర్ఆర్ మూవీపై ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి ఒక్కరూ కూడా స్పందించలేదు. బిగ్ బీ అమితాబ్, షారూఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ మొదలగు హీరోల నుంచి శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ వంటి హీరోయిన్ల వరకు ఏ ఒక్కరూ ఈ విషయంపై నోరు మెదపడం లేదు.
కనీసం సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్టులు పెట్టడం లేదు. దీంతో తెలుగు సినీ లవర్స్ బాలీవుడ్ పై భగ్గుమంటున్నారు. ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినిమాకు ఇంతటి గౌరవం కలగడం బాలీవుడ్ తారలకు ఇష్టంలేదని, వాళ్లు ఈర్ష్యతో రగిలిపోతున్నారంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. బాలీవుడ్ సాధించలేనిదాన్ని రాజమౌళి సాధించి చూపాడనే కోపంతోనే వాళ్లంతా స్పందించడం లేదని వారంటున్నారు.
ఎలాంటి వివక్షత లేకుండా పాన్ ఇండియా మూవీ కాన్సెప్ట్ తో హిందీ సినిమాలను తాము ఎంతో ప్రేమతో ఆదరిస్తోంటే.. తమ సినిమాను మాత్రం బాలీవుడ్ పట్టించుకోవడం లేదని వారు ఫైర్ అవుతున్నారు. తమ సినిమాలను కూడా అదే స్ఫూర్తితో చూడాలని, లేకుంటే భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమాలను బాయ్ కాట్ చేస్తామంటూ సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ బాలీవుడ్ కు వార్నింగ్ ఇస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఆస్కార్ వేడుకలో పాల్గొన్న దీపికా పదుకొనె ఒక్కరే నాటు నాటు సాంగ్ గురించి, ఆర్ఆర్ఆర్ గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు.