అలా చేసేందుకు పెళ్లి ఎందుకు సహజీవనం చేస్తా.. హీరోయిన్ కామెంట్స్ వైరల్

by Hamsa |
అలా చేసేందుకు పెళ్లి ఎందుకు సహజీవనం చేస్తా.. హీరోయిన్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి మోనిశ మోహన్ మీనన్ మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసింది. ఇటీవల ఫైట్ క్లబ్ మూవీతో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మోనిశ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘ అంజలి మీనన్, జోయా అక్తర్ వంటి దర్శకురాళ్ల సినిమాలు చూశాక నాక్కుడా డైరెక్టర్ కావాలనిపించింది. ఈ విషయం గురించి ఇంట్లో వాళ్లకు చెప్పాను. నాన్న ఒప్పుకోలేదు ఇంజనీరింగ్ చదివితే సరిపోతుంది సినిమాల్లోకి వద్దన్నారు. కానీ నాకు మాత్రం ఇండస్ట్రీ వైపే మనసు లాగేది.

ఇంజనీరింగ్ పూర్తయ్యాక మళ్లీ అడిగినా ఇంట్లో కాదన్నారు. వాళ్లు ఒప్పుకోరని అర్థం అయి 2016 ఇల్లు వదిలి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత ఆడిషన్స్ ఇచ్చి సినిమాల్లోకి వచ్చాను. ముప్పుతిప్పలపడి డైరెక్టర్ రోషన్ తెరకెక్కించిన నాలుగు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. కానీ ఎప్పటికైనా డైరెక్టర్ కావాలన్నది నా కల. పెళ్లి విషయానికి వస్తే.. నాకు అలాంటి ఆలోచన లేదు. పెళ్లికి బదులుగా సహజీవనం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు రెండు నెలలు కాగానే బ్రేకప్ చెప్పుకుని మరొకరిని ప్రేమిస్తున్నారు. ఆ మాత్రం దానికి పెళ్లి ఎందుకు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story