అయ్యో ఐశ్వర్యకు ఏమైంది? చేతికి కట్టు.. కూతురు ఆరాధ్యతో ప్రపంచ సుందరి

by Ramesh N |   ( Updated:2024-05-20 10:54:10.0  )
అయ్యో ఐశ్వర్యకు ఏమైంది? చేతికి కట్టు.. కూతురు ఆరాధ్యతో ప్రపంచ సుందరి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కుడిచేతికి కట్టుతో కనిపించడంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతోన్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఐష్ బుధవారం తన కూతురు ఆరాధ్యతో కలిసి బయల్దేరారు. ముంబై ఎయిర్‌పోర్టులో చేతికి కట్టుతో కనిపించారు. పైగా కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవ్వటంతో ఫ్యాన్స్ 'గెట్ వెల్ సూన్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఐష్‌కు ఏమైంది.

చేతికి గాయం ఎలా అయింది.. అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆమె గాయంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. కేన్స్ జ్యూరీ మెంబర్‌గా పనిచేసిన తొలి భారతీయ మహిళా నటి ఐశ్వర్యరాయ్. గాయం ఉన్నప్పటికీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ పాల్గొనటం.. ఆమె నిబద్ధత, ఆమె అంత ప్రొఫెషనల్‌గా ఎవరూ ఉండరని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed