Nindu Noorella Saavasam Serial : పూర్తయిన అరుంధతి అంతిమసంస్కారం.. మనోహరిని బయపెడుతున్న అరు ఆత్మ!

by Anjali |   ( Updated:2023-08-24 12:40:05.0  )
Nindu Noorella Saavasam Serial : పూర్తయిన అరుంధతి అంతిమసంస్కారం.. మనోహరిని బయపెడుతున్న అరు ఆత్మ!
X

దిశ, సినిమా: అరుంధతి చనిపోవడాన్ని తట్టుకోలేకపోతాడు అమర్. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న భర్తను చూసి కుమిలిపోతుంది అరుంధతి ఆత్మ. రాథోడ్ మనోహరికి ఫోన్ చేసి అరుంధతి చనిపోయిందని వెంటనే ఆర్మీ హాస్పిటల్కి రమ్మని చెబుతాడు. సరేనంటూ బాధను నటిస్తుంది మనోహరి. అంజలికి దెబ్బలు తగలడంతో చికిత్స చేస్తుంటారు వైద్యులు. మిగతా పిల్లలు పరుగున వచ్చి ఏం జరిగిందో తెలుసుకుని ఏడుస్తూ ఉంటారు. అరుంధతి మరణానికి సంబరపడిపోతున్న మనోహరి హాస్పిటల్కి వచ్చి ఏడుపు నటిస్తూ అమర్ని, పిల్లలని ఓదారుస్తుంది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తవగానే అరుంధతి పార్ధీవదేహాన్ని తీసుకెళ్లమని చెబుతారు హాస్పిటల్ సిబ్బంది. అరుంధతిపై పడి గుండె పగిలేలా ఏడుస్తాడు అమర్.

కొడుకు, కోడలు ఫోన్లు పనిచేయట్లేదని కంగారు పడుతుంటారు అమర్ తల్లిదండ్రులు. మనోహరికి ఫోన్ చేయడం కంటే కాసేపు వేచి చూద్దామని, ఆ అమ్మాయి మాటలు, చూపుల్లో ఏదో కపటబుద్ది దాగి ఉంటుందని అనుకుంటారు. ఏం జరిగిందోనని అనుకుంటుండగా అమర్, మనోహరి, పిల్లలు అరుంధతి దేహాన్ని తీసుకుని వస్తారు. ఏం అర్థంకాని వారు అరుంధతిని విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరవుతారు.

హైదరాబాద్ నుంచి తనను కొడైకెనాల్ రప్పించిన అరుంధతి తనని ఎందుకు కలవలేదో, అసలు ఏం జరిగి ఉంటుందో అని ఆలోచిస్తూ తిరుగు ప్రయాణమవుతుంది భాగమతి. ఫ్లైట్లో కూర్చున్న భాగమతి కలలోకి అరుంధతి ఆత్మ వచ్చి తన కల నిజంకాదని ఎందుకు అబద్దం చెప్పావంటూ ఏడుస్తుంది. ఉలిక్కిపడి వెంటనే లేస్తుంది భాగమతి. అలాంటి కల ఎందుకు వచ్చిందోనని ఆలోచిస్తూ రూమ్కి చేరుకుంటుంది. జరిగిందంతా తన స్నేహితురాలితో చెప్పి బాధపడుతుంది.

కుటుంబసభ్యులతో కలిసి అరుంధతి అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తాడు అమర్. అప్పుడే తన సవతి తల్లి నుంచి తన తండ్రికి ఆరోగ్యం బాలేదని ఫోన్ రావడంతో స్నేహితురాలితో కలిసి హాస్పిటల్కి బయలుదేరుతుంది భాగమతి. దారి మధ్యలో అరుంధతి అంతిమయాత్ర చూసిన భాగికి తనకి బాగా దగ్గరైన వ్యక్తి చనిపోయినట్లు అనిపిస్తుంది. మనసుకి తెలియని బాధ దేనిగురించో ఆలోచిస్తూనే హాస్పిటల్కి చేరుకుంటుంది. అక్కడ చెట్టుకింద ఉన్న తండ్రిని చూసి షాకవుతుంది. డబ్బులు కడితేనే హాస్పిటల్లో చేర్చుకుంటామంటున్నారని చెబుతుంది సవతి తల్లి. ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్న భాగమతి ఏం చెయ్యాలో అర్థంకాక బాధపడుతుంది.

మనోహరిని అరుంధతి ఆత్మ వెంటాడుతుంది. కళ్లు మూసుకుంటే చాలు తననెందుకు చంపావంటూ నిలదీస్తుంది. దాంతో ఇంటి పనిమనిషికి చెప్పి ఏదైనా తాయిత్తు తీసుకుని రమ్మంటుంది. సరేనన్న పనిమనిషి తాయిత్తు తెచ్చి గుమ్మానికి కడుతుంది. దాని ప్రభావంతో నిద్రపోతున్న తన పిల్లలను చూసుకుంటున్న అరుంధతి ఆత్మ బయటకు నెట్టివేయబడుతుంది. ఎంత ప్రయత్నించినా అరుంధతి ఆత్మ ఇంట్లోకి రాలేకపోతుంది. తాయత్తుని దాటి అరుంధతి ఆత్మ తన పిల్లలను ఎలా కలుసుకుంటుంది? భాగమతి, అమర్లను అరుంధతి ఎలా కలుపుతుంది? తెలియాలంటే ఈరోజు, ఆగస్టు 24న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!

Advertisement

Next Story