- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nindu Noorella Saavasam Serial : లోయలో పడ్డ అరుంధతి.. కుటుంబాన్ని వీడిపోలేని అరుంధతి ఆత్మ!
దిశ, సినిమా : అమరేంద్రను దక్కించుకోడానికి అరుంధతిని చంపడానికి ప్లాన్ చేస్తుంది మనోహరి. అమర్, అరుంధతిల పెళ్లిరోజునే ఆమె చావుకు ముహూర్తం పెడుతుంది. అందుకు కిరాయి గుండాలను కూడా మాట్లాడుతుంది. తన ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లు జరగాలని రౌడీలకు ఫోన్ చేస్తుంది మనోహరి. ఏం ప్లాన్ అని అడుగుతుంది అంజలి. మీ అమ్మానాన్నలకి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశానని నమ్మిస్తుంది మనోహరి. అంజలి కూడా తల్లిదండ్రులతో గుడికి బయలుదేరుతుంది. గుడకి బయలుదేరుతుంటే అరుంధతిని జాగ్రత్త అని చెప్పి అంజలిని ఆపాలని ప్రయత్నిస్తుంది మనోహరి. అంజలి వినకుండా గుడికి వెళ్తానని మొండికేస్తుంది. అరుంధతి చెప్పడంతో అమరేంద్ర కూడా సరేనంటాడు.
అమర్, అంజలిలను సురక్షితంగా ఉంచాలని, అరుంధతిని మాత్రమే చంపాలని మనోహరి తన అనుచరులకు సమాచారం ఇస్తుంది. అమర్, అరుంధతితోపాటు అంజలి కూడా గుడికి వెళ్తుంది. భాగమతి తనను కొడైకెనాల్ వచ్చేలా చేసిన అరుంధతిని వెతుక్కుంటూ గుడికి వస్తుంది. జరిగిందంతా పూజారికి చెప్పడంతో ఆరోజు ఏ జంట పెళ్లిరోజని వచ్చినా తనకు చెబుతానని మాటిస్తాడు పూజారి. సంతోషంతో ఫ్రెష్ అయి రావడానికి వెళ్తుంది భాగమతి. కల నిజమవబోతోందని స్వామీజీ హెచ్చరిస్తాడు. ఆయన మాటలు అర్థంకాని భాగి అక్కడనుంచి వెళ్లిపోతుంది. అమర్, అరుంధతి గుడికి వెళ్లి పూజ చేయిస్తారు. అమర్ తనకు అర్జెంట్ పనుందని చెప్పి బయటకు వస్తాడు. అరుంధతి తమ పెళ్లిరోజని పూజారికి చెప్పగానే భాగమతి విషయం చెబుతాడు పూజారి. భాగి ఆ గుళ్లోనే ఉందని తెలుసుకున్న అరుంధతి సంబరపడిపోతుంది. భాగమతిని వెతుక్కుంటూ గుడి మొత్తం పరుగులు పెడుతుంది. కానీ అంతలోనే అమర్‌కు అర్జెంట్ కాల్ రావడంతో వెంటనే వెళ్లాలని అరుంధతిని హెచ్చరిస్తాడు. దీంతో నిరాశతో ఇంటికి బయలుదేరుతుంది అరుంధతి.
తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డులో అమర్ కారు బోల్తా పడింది. మనోహరి అనుచరులు కారు వైపు రావడం ప్రారంభిస్తారు, అరుంధతి ఈ విషయాన్ని గమనిస్తుంది. ఆమె అంజలిని సకాలంలో బయటకు నెట్టివేస్తుంది. కాని తనను తాను రక్షించుకోవడంలో విఫలమవుతుంది. ట్రక్కు కారును ఢీకొనడంతో అరుంధతి లోయలో పడిపోతుంది. రోడ్డుపైకి వచ్చి తన కుటుంబం లోయలో పడి ఉండటం చూస్తాడు అమర్. రాథోడ్ అరుంధతిని కాపాడటానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుంది. ఎంతో ప్రేమను పంచే కుటుంబాన్ని వదిలి వెళ్లలేక అరుంధతి ఆత్మగా మారుతుంది. ప్లాన్ సక్సెస్ అయ్యిందని మనోహరికి సమాచారం ఇస్తారు ఆమె అనుచరులు. ఆమె అరును వివాహం చేసుకోవడానికి అమర్ ఆమెను ఎలా తిరస్కరించాడో గుర్తుచేసుకుంటూ గతంలోకి వెళుతుంది. ఇంతకీ మనోహరి గతంలో ఏం జరిగింది? అమర్ మనోహరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? తెలుసుకోవాలంటే ఈరోజు, ఆగస్ట్ 22న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!