నిఖిల్ సిద్ధార్థ్ 'SPY' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

by Prasanna |   ( Updated:2023-02-04 11:17:09.0  )
నిఖిల్ సిద్ధార్థ్ SPY నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా గర్రి బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'స్పై'. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ‌లో నిఖిల్‌కు జోడిగా ఐశ్వర్య మీనన్ నటిస్తుండగా.. ఈడీ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై కె. రాజశేఖర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఈ ఏడాది సమ్మర్ సీజన్‌లో అన్ని భాషల్లో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నటు సమాచారం. తాజాగా ఈ మూవీ నుంచి హీరో నిఖిల్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. నిఖిల్ చేతిలో గన్ పట్టుకొని బ్లాక్ అండ్ బ్లాక్‌లో గూడచారి‌లా అందరినీ ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఈ మూవీ నిఖిల్ సిద్ధార్థ్‌కు మరో సక్సెస్‌ను అందించేలా కనిపిస్తోంది.

Also Read...

Director SS Rajamouli.. దసరా సినిమా దర్శకుడిని ఆకాశానికి ఎత్తేశాడుగా

Advertisement

Next Story