Niharika Konidela: వారసత్వం ఉంటే సినిమాల్లో సక్సెస్ అవ్వలేరు.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్

by sudharani |
Niharika Konidela: వారసత్వం ఉంటే సినిమాల్లో సక్సెస్ అవ్వలేరు.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: నటుడు నాగబాబు కూతురిగా, నటిగా అందరికి సుపరిచితురాలైన నిహారిక ప్రజెంట్ నిర్మాతగా రాణిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె సమర్పణలో రూపొందిన తాజా చిత్రం 'కమిటీ కుర్రోళ్లు'. యదు వంశీ దర్శకత్వంలో అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిహారిక కొణిదెల మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ 'పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. వంశీ పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్‌లు కూడా ఇందులో ఉన్నాయి. వంశీ స్వతహాగా పవన్ కళ్యాణ్‌కు అభిమాని. 2019 ఎన్నికల ప్రచార టైంలో జరిగిన విషయాలను కూడా ఇందులో తన స్టైల్లో, కాస్త సెటైరికల్‌గా చూపించారు. ఈ కథ విన్నప్పుడు పదకొండు మంది అబ్బాయిల కారెక్టర్లో నన్ను నేను ఊహించుకొన్నాను. సినిమాను చూసే ప్రతీ ఆడియెన్ ఏదో ఒక కారెక్టర్‌తో ట్రావెల్ చేస్తారు.

ప్రతీ ఒక్కరూ సినిమాకు కనెక్ట్ అవుతారు. మా కమిటీ కుర్రోళ్లు అందరి మనసు గెలుచుకుంటారనే నమ్మకం ఉంది. ఇటీవల అన్న వరుణ్‌, వదిన లావణ్యలు సినిమాను చూశారు. వాళ్లకి సినిమా చాలా నచ్చింది.. మా అన్న ఎప్పుడూ స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా చెప్పేస్తుంటారు. ఈ మూవీ చూసి వెంటనే నన్ను పిలిచి అభినందించారు. నటిగా మంచి కథలు, కాన్సెప్ట్‌లు, స్క్రిప్ట్‌లకే నా ప్రాధాన్యం ఇస్తా. పాత్ర బాగుంటే మిగతా అంశాల గురించి అంతగా పట్టించుకోను. చిన్న పాత్ర అని, చిన్న హీరో అని కూడా ఆలోచించను. కథ బాగుండి.. పాత్ర నచ్చితే సినిమాల్లో నటిస్తాను' అన్నారు. అలాగే వారసత్వం గురించి మాట్లాడుతూ.. ‘వారసత్వం ఉంది కదా అని సినిమాల్లోకి వస్తే సక్సెస్ అవ్వలేరు. సినిమా అంటే ప్యాషన్, ఇష్టం ఉండాలి. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడాలి. అప్పుడే విజయం సాధిస్తారు' అంటూ నిహారిక చేసిన కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story