వదినమ్మ వచ్చేసిందంటూ నిహారిక పోస్ట్.. అలాంటి కామెంట్స్ పెడుతూ రచ్చ చేస్తున్న నెటిజన్లు

by Hamsa |   ( Updated:2023-11-03 11:15:23.0  )
వదినమ్మ వచ్చేసిందంటూ నిహారిక పోస్ట్.. అలాంటి కామెంట్స్ పెడుతూ రచ్చ చేస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య నవంబర్ 1న వివాహ బంధంతో ఒకటయ్యారు. వారు మొదటిసారి కలుసుకున్న ప్రదేశం ఇటలీలోని టుస్కానీయాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ వేడుకలకు మెగా ఫ్యామిలీ ముందుగానే ఇటలీకి చేరుకున్నారు. పెళ్లిని గ్రాండ్‌గా జరిపించి వరుణ్-లావణ్యలను ఒక్కటి చేశారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నితిన్ స‌హా పలువురు సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఎన్నో ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వరుణ్ తేజ్ పాపుల‌ర్ డిజైన‌ర్ మనీష్ మల్హోత్రా ఆఫ్-వైట్ షేర్వానీలో, భారీ బంగారు ఎంబ్రాయిడరీతో కనిపించాడు. లావణ్య విషయానికొస్తే, ఆమె రూబీ-ఎరుపు కాంచీపురం చీరలో కనిపించింది. ఆమె మ్యాచింగ్ రెడ్ బ్లౌజ్ - కస్టమ్ టిష్యూ సిల్క్ వీల్‌ను కూడా ధరించింది.

భారీ నెక్లెస్‌లు, గాజులు ధ‌రించి అందంగా క‌నిపించింది. అలాగే వీరి రిసెప్షన్ నవంబర్ 5న గ్రాండ్‌గా హైదరాబాద్‌లో టాలీవుడ్ సెలబ్రిటీల మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నా వదినతో కలిసి దిగిన ఓ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసింది. అందులో నిహారిక చాలా సంతోషంగా వరుణ్-లావణ్యలను పట్టుకుని కనిపించింది. అలాగే ‘‘వదినమ్మ వచ్చేసింది’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. కొందరు నువ్వు నీ భర్తతో కలిసి ఉంటే బాగుండేదని అంటుంటే.. మరి కొందరు మాత్రం నీలాగ మధ్యలో విడిపోకుండా జీవితాంతం కలిసి ఉండాలి అని కామెంట్లు చేస్తున్నారు.

Read More..

మెగా ఫ్యామిలీ కారణంగా పవన్ కల్యాణ్ భార్యపై ట్రోల్స్.. ఫొటోస్ వైరల్


Advertisement

Next Story