Samanthaను ఫాలో అవుతున్న Niharika .. త్వరలో విడాకుల ప్రకటన..?

by sudharani |   ( Updated:2023-05-31 14:16:59.0  )
Samanthaను ఫాలో అవుతున్న Niharika .. త్వరలో విడాకుల ప్రకటన..?
X

దిశ, వెబ్‌డెస్క్: నిహారిక కొణిదెల గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటోంది. పెళ్లైన సరే తన భర్తకు దూరంగా ఉంటుందని ఈ క్రమంలోనే ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించని మెగా డాటర్.. సినిమాలు చేస్తునే, ఫ్రెండ్స్‌తో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. నిహారికను సమంతతో పోల్చుతున్నారు నెటిజన్లు.

సమంత విడాకుల ప్రకటనకు ముందు ఫ్రెండ్స్‌తో కలిసి వివిధ ప్రాంతాలకు వెళ్లింది. విడాకుల డిప్రెషన్ నుండి బయట పడేందుకే సమంత స్నేహితుల హెల్ఫ్ తీసుకుందని అప్పట్లో టాక్. అంతే కాకుండా కొన్ని ఆధ్యాత్మిక టూర్స్ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాతే సమంత విడాకులు ప్రకటన జరిగింది. అయితే.. నిహారిక కూడా అదే పనిలో ఉందంటున్నారు నెటిజన్లు. ఫ్రెండ్స్‌తో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి విడాకులే కారణమని టాక్. ఇక ఇరువర్గాలు చర్చలు జరిపినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని, లాయర్స్ లీగల్ వర్క్ చేస్తున్నారట. ఇదే కనుక నిజం అయితే త్వరలో విడాకుల ప్రకటన వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

Also Read..

హాట్ ఫొటోస్‌తో రచ్చ చేస్తున్న నిహారిక.. బోల్డ్ గా మారుతోందంటున్న నెటిజన్స్

డబ్బుకోసం సమంత అంత పని చేస్తోందా?

Advertisement

Next Story