హనీమూన్‌ ట్రిప్‌లో కొత్త జంట.. ఫోటోలు వైరల్!

by Kavitha |
హనీమూన్‌ ట్రిప్‌లో కొత్త జంట.. ఫోటోలు వైరల్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గత కొద్ది కాలంగా నటుడు జహీర్ ఇక్బాల్‌తో రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల పెద్దలను ఒప్పించి ప్రియుడిని 23న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. రిసప్షన్‌ను మాత్రం ముంబైలో గ్రాండ్‌గా చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేసింది. పెళ్లి ఫోటోలను ఈ అమ్మడు నెట్టింట షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఇక అప్పటి నుంచి సోనాక్షి సిన్హాకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తునే ఉన్నాయి. ఈ క్రమంలోనే వీరి హనీమూన్ ట్రిప్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ జంట హనీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. న్యూలీ మ్యారీడ్ కపూల్ స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతూ హనీమూన్ ట్రిప్‌ను ఆస్వాదిస్తున్నారు. కాగా తాజాగా వచ్చిన డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి సిరీస్‌లో సోనాక్షి సిన్హా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.






Advertisement

Next Story

Most Viewed