- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి సీన్స్‌లో ఇప్పటి వరకు నటించలేదు.. డైరెక్టర్‌కు ముందే క్లారిటీ ఇస్తానంటున్న సోనాక్షి సిన్హా
దిశ, సినిమా: సోనాక్షీ సిన్హా.. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక దాదాపు 14 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఈ బ్యూటీ.. ఇప్పటికీ కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ప్రజెంట్ తన 35వ చిత్రంలో నటిస్తున్న సోనాక్షి.. ఇప్పటి వరకు ముద్దు సీన్స్, రొమాన్స్‌లో నటించలేదంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తనను తాను ఎప్పుడు కోల్పోలేదని తాజా ఇంటర్వ్యూలో తెలిపింది.
సోనాక్షి మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు నా 35వ చిత్రంలో ‘హీరమండి’ ఉన్నాను. అయితే ఇప్పటికీ నేను ఓ నటిగానే గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాను. కానీ నాకు అసౌకర్యంగా ఉన్న సీన్స్, బట్టలు ధరించేందుకు ఏ మాత్రం ఇష్టపడను. మంచి నటన ఉంటే అది మనల్ని పైకి తీసుకొస్తుంది. అందుకే నా మొత్తం కెరీర్‌లో నేను ముద్దు పెట్టుకున్న సీన్స్ కానీ చిన్న బట్టలు ధరించింది కూడా లేదు. అంతే కాకుండా నేను నా డైరెక్టర్లకు ముందే చెప్తాను. ఇలాంటి సీన్స్ నాకు అసౌకర్యంగా అనిపిస్తాయి. కావాలంటే ఇందుకోసం మీరు వేరే వారిని సంప్రదించవచ్చు.. నేను అందుకు ఏం అనుకోను అని చెప్పేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More...