చాయ్ అన్నావా.. చై అన్నావా.. శోభిత లేటెస్ట్ పోస్ట్‌పై నెట్టంట రచ్చ!

by sudharani |   ( Updated:2024-05-04 14:40:53.0  )
చాయ్ అన్నావా.. చై అన్నావా.. శోభిత లేటెస్ట్ పోస్ట్‌పై నెట్టంట రచ్చ!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ ‘గూఢచారి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు మూవీస్‌లో నటించి తన అందంతో, యాక్టింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉంటూ.. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ప్రేక్షకులతో పంచుకుంటోంది. దాంతో పాటు.. నెట్టింట తన అందాలతో సెగలు పుట్టిస్తుంది. క్రేజీ అవుట్ ఫిట్స్‌లో దర్శనమిచ్చి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.

ఇక శోభిత ఏ పోస్ట్ పెట్టిన అది నెట్టింట వైరల్ అవుతోంది. అంతే కాకుండా అప్పుడప్పుడు కొటేషన్స్ పంచుకుంటోంది ఈ అమ్మడు. కానీ, అవి నెట్టింట కొత్త రచ్చకు దారి తీస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా శోభిత పెట్టిన ఓ కొటేషన్‌కు కొత్త అర్ధాలు వెతుకుతున్నారు మన నెటిజన్లు. ఇంతకి ఆ కొటేషన్ ఏంటంటే.. ‘iam not everyone's cup of chai’ అనే కొటేషన్ పెట్టింది. అంటే నేను అందరికి నచ్చాలని లేదు.. అనే ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఇది నెట్టింట వైరల్ కావడంతో.. ‘అసలు Chai ప్లేసులో Tea అని పెట్టొచ్చు కదా.. చైతు పేరు వచ్చేలా Chai అని పెట్టావా’ ‘ఈ పోస్ట్ అర్థం ఏంటీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Read More..

మరోసారి సూపర్ కాంబో రిపీట్.. సమంత, అనుపమ కాంబినేషన్‌లో లేడీ ఓరియెంటెడ్ మూవీ?

Advertisement

Next Story