Swetha Varma : నీ వక్షోజాలు అదుర్స్ అన్న నెటిజన్.. బ్యూటీ రియాక్షన్ ఇదే!

by Hamsa |   ( Updated:2024-04-24 08:42:05.0  )
Swetha Varma : నీ వక్షోజాలు అదుర్స్ అన్న నెటిజన్.. బ్యూటీ రియాక్షన్ ఇదే!
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి Swetha varma పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో పాల్గొని ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఎక్కువ రోజులు ఇంట్లో ఉండనప్పటికీ బయటకు వచ్చాక పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ.. అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఈ క్రమంలోనే.. శ్వేతా పుట్టిన రోజు కావడంతో ఓ నెటిజన్ విషెస్ తెలిపాడు. అలాగే నీ వక్షోజాలు అదుర్స్ అంటూ కామెంట్ చేశాడు.

తాజాగా, దీనిపై శ్వేతా వర్మ స్పందిస్తూ.. వరుస పోస్టులు షేర్ చేసింది. అదే తన తల్లిని అయితే ఇలాగే అంటాడా? ఇలాంటి వ్యక్తులను చూస్తే సిగ్గేస్తుంది. నాకున్న కాంటాక్ట్ ద్వారా అతని అడ్రస్, ఫోన్ నెంబర్ సంపాదించాను. అది రియల్ అకౌంట్.. ఫేక్ అకౌంటా? అని ఆలోచన అక్కర్లేదు. అది ఏదైనా తెచ్చిపెట్టే నాకున్న సోర్స్ అలాంటిది. అతని అడ్రస్ కూడా పోస్ట్ చేయగలను కానీ నేను చేయను. ఎందుకంటే.. నేను మనిషిని కాబట్టి అలా చేయడం లేదు. అది చూసి అయినా అతను గుణపాఠం నేర్చుకుని మారితే మంచిది. ఇంకోసారి ఇలా చేయకుండా ఉంటాడని అనుకుంటున్నాను. అందుకే అతనిపై యాక్షన్ తీసుకోవడం లేదు’’ అంటూ వరుస పోస్ట్‌లు పెట్టింది.

Advertisement

Next Story

Most Viewed