- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ డ్యాన్స్ ఏంటి నాయనా.. కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ పై ఫైర్ అవుతున్న నెటిజెన్స్
దిశ, సినిమా: రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మూవీ మిస్టర్ బచ్చన్. రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీపై మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కి భారీ అంచనాలున్నాయి. హరీష్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ మళ్లీ ఫామ్ లోకి వస్తాడనేది చూడాలి. రీసెంట్ గా విడుదలైన అయిన గ్లీమ్ప్స్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమవుతుంది.
తాజాగా, ఈ మూవీ నుంచి ‘సితార్’ పేరుతో ఫస్ట్ లిరికల్ పాటను విడుదల చేసారు మేకర్స్. పాట వినడానికి బాగానే ఉన్నా.. పాటలో ఉన్న డ్యాన్స్ స్టెప్పులు చూసి నెటిజన్స్ మండిపడుతున్నారు. ముందు ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసిన వారిని అనాలంటున్నారు.
ఈ సాంగ్ కి డ్యాన్స్ స్టెప్పులు కంపోజ్ చేసింది ఎవరో కాదు శేఖర్ మాస్టర్. మీ నుంచి ఇలాంటివి మేము ఎక్స్ పెక్ట్ చేయడం లేదు. రవితేజాకి ఎంత వయస్సు ఉంది ఆ హీరోయిన్ కి ఎంత వయస్సు ఉంది.. కొంచం చూసుకోవాలి కదా.. కూతురు లాంటి అమ్మాయి నడుమ మీద చేతులేస్తూ ఆ డ్యాన్స్ ఏంటి నాయనా అంటూ మండిపడుతున్నారు. ఈ పాటని మళ్ళీ రీషూట్ చేయాలనీ రవితేజ డై హార్ట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చెత్త స్టెప్పులు ఇంకోసారి కంపోజ్ చేయొద్దు అంటూ నెటిజన్లతో పాటు ప్రేక్షకులు కూడా విమర్శిస్తున్నారు.