ఇన్ స్టాలో ఆ వీడియో పెట్టిన స్వాతి.. ఛీ నీ బతుకు అంటూ కామెంట్స్!

by Jakkula Samataha |
ఇన్ స్టాలో ఆ వీడియో పెట్టిన స్వాతి.. ఛీ నీ బతుకు అంటూ కామెంట్స్!
X

దిశ, సినిమా : కలర్స్ స్వాతి గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లితెరపై కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి తర్వాత తెలుగు, మలయాళ, తమిళ సినిమాల్లో నటించి ప్రేక్షకుల నుంచి మంచి ఫేమ్ సంపాదించుకుంది. తెలుగులో అష్టా చెమ్మా సినిమా తర్వాత ఈ బ్యూటీ గ్రాఫ్ మరింత పెరిగిపోయింది. దీంతో స్వాతికి టాలీవుడ్‌లో వరసగా ఆఫర్స్ వచ్చాయి. కార్తికేయ, స్వామిరారా, త్రిపుర,కలవరమాయే మదిలో, మిరపకాయ్, సంఘర్షణ ఇలా చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఎప్పుడూ అల్లరి అల్లరిగా ఉంటూ తన క్యూట్ క్యూట్ మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన భర్తతో విడాకులు తీసుకుందని అనేక రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో కలర్స్ స్వాతి తన భర్త నుంచి విడిపోయిందంటూ ఆ మధ్య చాలా చర్చ జరిగింది. కానీ ఈ నటి మాత్రం దానిపై ఎలాంటి క్లారిటి అఫీషియల్‌గా ఇవ్వలేదు. ఇక మంత్ ఆఫ్ మధు సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అదే హవా కొనసాగిస్తుంది. అయితే తాజాగా స్వాతి తన బంధువులు, ఫ్రెండ్స్‌ను పరిచయం చేస్తూ .. ఇన్ స్టా స్టోరీలో వీడియోలను షేర్ చేసింది. కాగా, దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఛీ ఛీ నీ బతుకు అంటూ రిప్లై ఇచ్చారు. కాగా,ఆమె దానికి సమాధానం ఇస్తూ..నాకు కూడా కొన్ని సార్లు అలానే అనిపిస్తుంది.. జీరో పోస్ట్ ఛాంపియన్స్ అంటూ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.





Advertisement

Next Story