- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలియా భట్ హాలీవుడ్ ఎంట్రీ! ఉమెన్స్‌డే నాడు నెట్‌ఫ్లిక్స్ ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్ః ఆలియా భట్ ఎంట్రీ నుంచి సంచలనంగానే ఉంటోంది. అందం, అభినయం కలగలుపుకొని, బాలివుడ్‌లో షార్ట్ టైమ్‌లోనే టాప్ గార్ల్‌గా నిలిచింది. తన తాజా చిత్రం గంగూబాయి కతియావాడితో ఆలియా ప్రస్తుతం థియేటర్లలో మోతపుట్టిస్తోంది. ప్రేక్షకులే కాదు, సినీ విమర్శకులు కూడా ఆలియాను అంతెంత్తుకు లేపేశారు. అయితే, ఇప్పడు అంతకుమించిన శుభవార్త ఆలియా అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బాలివుడ్‌లో భేష్ అనిపించేసుకున్న ఆలియా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతున్న హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రంతో హాలివుడ్ ఆరంగేట్రం చేయనుంది. అంతర్జాతీయ ప్రేక్షకులనూ అలరించనుంది.
ఈ చిత్రంలో గాల్ గాడోట్, జామీ డోర్నన్ ఇప్పటికే క్రెడిట్‌లు సాధించుకోగా, ఇక ఆలియా భట్ తన సత్తాను చాటనుంది. ఈ అంతర్జాతీయ స్పై థ్రిల్లర్‌కు టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్నారు. దీనికి నెట్‌ఫ్లిక్స్, స్కైడాన్స్ సహకారం అందిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆలియా భట్ ఎంట్రీని ప్రకటించింది. "ఆలియా భట్ హార్ట్ ఆఫ్ స్టోన్‌లో ఉండబోతోందన్న ప్రకటనతో ఈ రోజు (ఉమెన్స్‌డే)ను ప్రారంభిస్తున్నాము" అంటూ పేర్కొన్నారు.
ఇక, ఇప్పటికే ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్ బచ్చన్, అనిల్ కపూర్, దివంగత ఇర్ఫాన్ ఖాన్, అలీ ఫజల్ వంటి బాలీవుడ్ తారలు హాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో పనిచేయగా, ఇటీవల దీపికా పదుకొణె త్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్‌తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా అలియా భట్ "గాల్ గాడోట్"తో స్క్రీన్‌పై మెరవనుండటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.