- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ravi Teja ను తొక్కేస్తున్నారా.. అసలు ఆ వివాదం ఏంటీ?
సినిమా : మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమల్లోకి అడుగు పెట్టిన ఈయన వరస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఇటీవల ఆయన హీరోగా నటించిన రామారావ్ ఆన్ డ్యూటీ ప్లాప్ అయినా, ధమాక మంచి హిట్ అందుకుంది.
పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా ఏకంగా వందకోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా మూవీటీం అధికారికంగా రీవీల్ చేశారు. అయితే ఇదే ఓ వివాదానికి కారణం అయ్యింది. అయితే ఓ మీడియా సంస్థ ధమాక సినిమా తప్పుడు లెక్కలు చూపిస్తుందని పేర్కొన్నారు. ధమాకా సినిమా సక్సెస్ అయిన మాట వాస్తవమే కానీ రూ. 65 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ మాత్రమే ధమాకా వసూలు చేసింది. అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం రూ.101 కోట్లు కలెక్షన్ చేసింది అంటూ హడావిడి చేశారు అని ఆరోపించారు.
దీంతో రవితేజ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. కావాలనే రవితేజను తొక్కేస్తున్నారంటూ ఆరోపించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూ.100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిందని అధికారికంగా లెక్కులు చూపించడమే కాకుండా ఐటీ కూడా చెల్లించారని రవితేజ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీంతో రవితేజపై కావాలనే ఇలా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయనను తొక్కేయాలనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి : Foot Ball Match కు హాజరైన Ranbeer and Aliya.. వీడియో వైరల్