Rashmika Mandanna : కొత్త లుక్‌లో దర్శనమిచ్చిన నేషనల్‌ క్రష్‌ రష్మిక ..

by Kavitha |   ( Updated:2024-02-22 10:45:20.0  )
Rashmika Mandanna : కొత్త లుక్‌లో దర్శనమిచ్చిన నేషనల్‌ క్రష్‌ రష్మిక ..
X

దిశ, సినిమా : భాషతో సంబంధం లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా అభిమానులను దక్కించుకున్న ఈ చిన్నది రీసెంట్ గా ‘యాలిమల్’ మూవీతో మరింత పాపులారిటి దక్కించుకుంది. ఇక నటన పరంగానే కాదు, ఫ్యాషన్‌ రంగంలో కూడా రష్మిక ముందుంటుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ట్రెండీ దుస్తుల్లో నెట్టింట సందడి చేస్తుంటుంది.

ఇందులో భాగంగా తాజాగా రష్మిక కొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి 26వరకు జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ‘మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌ 2024’ లో పాల్గొని ర్యాంప్‌పై వాక్‌ చేసింది. ఇక రష్మిక జపనీస్‌ ఫ్యాషన్‌ లేబుల్‌ అయిన ‘ఒనిత్సుకా టైగర్‌’ కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన బ్రాండ్‌ తరఫున ఈ ఫ్యాషన్‌ షోలో పాల్గొంది. ఈ క్రమంలో బ్లాక్‌ డ్రెస్‌, షార్ట్‌ హెయిర్‌ స్టైల్‌తో ర్యాంప్‌పై వాక్‌ చేసి చేసింది రష్మిక. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Read More..

లావణ్య,సమంత బాటలోనే శ్రీలీల.. ఆ బడా ఫ్యామిలీలోకి కోడలిగా వెళ్లబోతుందా?

Advertisement

Next Story
null