హార్దిక్ పాండ్యా తన భార్యను వదిలేశాడా.. మరోసారి తెరపైకి నటాషా, హార్దిక్ విడాకులు!

by Jakkula Samataha |
హార్దిక్ పాండ్యా తన భార్యను వదిలేశాడా.. మరోసారి తెరపైకి నటాషా, హార్దిక్ విడాకులు!
X

దిశ, సినిమా : క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్యకు విడాకులు ఇచ్చారంటూ అనేక వార్తలు ఆ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ తన భార్యతో నటాషా స్టాంకోవిచ్‌కు దూరంగా ఉంటున్నాడని, త్వరలోనే వీరు విడాకులు కూడా తీసుకోనున్నారు, భరణంగా ఇన్ని కోట్లు ఇవ్వడానికి హర్దిక్ రెడీ అయ్యాడంటూ చాలా పుకార్లు వచ్చాయి. అయితే తన భార్య పుట్టిన రోజు కనీసం విష్ చేస్తూ, ఆయన స్టేటస్ కూడా పెట్టకపోవడం, నటాషా కూడా హర్దిక్ తన ఇన్ స్టా అకౌంట్ నుంచి తమ వెడ్డింగ్ ఫోటోలు తొలగించడంతో, ఈ పుకార్లు ఎక్కువ అయ్యాయి. కానీ చివరకు ఆమె తన పెళ్లినాటిఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, వారు కలిసే ఉన్నట్లు తెలిపింది. దీంతో విడాకుల అనేవి రూమర్స్ అని తేలిపోయింది.

కాగా, మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. అనంత్ అంబానీ వెడ్డి సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అనంత్ అంబానీ , రాధికల సంగీత్ వేడుకకు హార్దిక్ తన భార్య నటాషాతో కాకుండా సింగిల్‌గా హాజరయ్యాడు. అంతే కాకుండా వరల్డ్ కప్ సెలబ్రేషన్స్‌లోనూ తన కొడుకు అగస్త్య మాత్రమే హర్దిక్‌తో కనిపించాడు. దీంతో వీరు విడిపోవడానికి రెడీ అయ్యారంటూ, విడాకుల వార్తలకు మరోసారి ఆజ్యం పోసినట్లయింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హార్దిక్ పాండ్యా తన భార్యను దూరం పెట్టాడు, వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story