- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలీవుడ్ ఇండస్ట్రీలో నిజాయితి పనికిరాదు.. అందరూ అలాంటి వారే..
దిశ, సినిమా : అమెరికన్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతికూల వాతవరణం ఉందంటోంది. ఇండస్ట్రీ కల్చర్ కారణంగా తాను కొంతకాలం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానన్న నటి.. తన సినీ ప్రయాణం అనుకున్నట్లు సాగలేదని చెప్పింది. అలాగే ఎనిమిదేళ్లపాటు విరామం లేకుండా ప్రతిరోజూ ఎంతో కష్టపడి పనిచేశానని, తన కుటుంబంతో కలిసి ఉండటానికి కూడా సమయం దొరకలేదన్న ఆమె.. అనేక రకాల ఒత్తిళ్లతో అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. ఈ క్రమంలో తన ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు రెండేళ్లు విరామం తీసుకున్నానన్న నర్గీస్.. తన చుట్టూ ఉన్న వ్యక్తులు స్వార్థంగా వ్యవహరించారని పేర్కొంది. కీర్తి, ప్రశంసలకు బానిస కాకుండా నిజాయితీగా ఉండటం వల్ల తాను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇక తనకు సౌకర్యంగా అనిపించని వ్యక్తులతో మాట్లాడేందుకు మొగ్గు చూపనని, మనుషులు మూడు రకాల ముఖాలు కలిగి ఉంటారని ఈ మధ్యే అర్థం చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ భామ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా 'హరిహర విరమల్లు'లో నటిస్తోంది.