సడెన్‌గా నా బేబీ నన్ను వదిలేసి వెళ్లిపోయిందంటూ బోరున ఏడుస్తున్న నరేష్

by Hamsa |   ( Updated:2024-07-21 07:34:30.0  )
సడెన్‌గా నా బేబీ నన్ను వదిలేసి వెళ్లిపోయిందంటూ బోరున ఏడుస్తున్న నరేష్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ హీరోగా సక్సెస్ కాకపోవడంతో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి పలు చిత్రాలతో మంచి విజయం సాధించి నటుడిగా కొనసాగుతున్నాడు. ఇక నరేష్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయనకు మూడో భార్య రమ్య రఘుపతితో వివాదం ఉంది. అయితే వీరిద్దరు అధికారికంగా విడాకులు తీసుకోలేదు. ఈ క్రమంలోనే.. నరేష్ ప్రముఖ నటి పవిత్రతో రిలేషన్‌ పెట్టుకున్నాడు. దీంతో రమ్య రఘుపతి గతంలో నానా హంగామా చేసిన విషయం తెలిసిందే.

అయినప్పటికీ పవిత్ర, నరేష్ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అలాగే ఈ వివాదం నడుస్తున్న క్రమంలోనే వీరిద్దరూ మళ్లీ పెళ్లి మూవీ చేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా లిప్ లాక్ పెట్టుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ కొద్ది కాలంగా నరేష్, పవిత్ర సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో.. తాజాగా, నరేష్ తన బేబీ తనను వదిలేసి వెళ్ళిపోయిందని ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నరేష్ బోరున ఏడుస్తూ.. ‘‘హలో నాగేశ్వర్ గారు మా బేబీ ఏటో వెళ్ళిపోయింది సార్. అది లేకుండా మాకు ఒక్క ముద్ద కూడా దిగదు. సడెన్‌గా వదిలేసి వెళ్లిపోయింది. తిరిగాను అందరినీ అడిగాను.. కల్కిలో బుజ్జీ తెలుసు కానీ బేబీ ఎవరో తెలియదని హేళన చేస్తున్నారు. మీ బుజ్జి లాంటిదే మా బేబీ కూడా.

మీకు బుజ్జి ఎంతో.. మాకు బేబీ అలాగ. దయచేసి అది కనిపిస్తే మాకు అందజేయండి. ఈ వీడియో చూసే వారికి బేబీ కనిపిస్తే మాకు తెచ్చి ఇవ్వండి ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వీడియో చూసిన వారంతా షాక్ అయ్యారు. అంతా పవిత్ర గురించే చెప్పాడని అనుకున్నారు. కానీ చివరికి ట్విస్ట్ ఇచ్చాడు నరేష్. కానీ అదంతా సినిమా ప్రమోషన్స్ అని తెలుస్తోంది. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న వీరాంజనేయులు విహారయాత్ర మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నరేష్ అలా చేశాడు. ఈ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుండటంతో మేకర్స్ వెరైటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు.



Pawan kalyan - Samantha: స్టార్ హీరోయిన్‌కు అపాయింట్మెంట్‌ ఇవ్వని డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్..?.

Advertisement

Next Story

Most Viewed