Nara Rohith: తన సినిమా ఫ్లాప్ అయిందని చెప్పుకున్న నారా రోహిత్.!

by Prasanna |   ( Updated:2024-08-26 14:03:03.0  )
Nara Rohith: తన సినిమా ఫ్లాప్ అయిందని చెప్పుకున్న నారా రోహిత్.!
X

దిశ, వెబ్ డెస్క్ : నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ‘ప్రతినిథి’ మూవీ 2014 లో విడుదలయ్యి యావరేజ్ గా నిలిచింది. ఆ సమయంలో ఎన్నికలు రావడం.. ఆ సినిమాకి ప్లస్ అయింది. ఇక ఈ ఏడాది కూడా అదే టైంలో ఏపీలో ఎన్నికలు జరిగాయి. ‘ప్రతినిధి 2’ మూవీ విడుదలకు రెడీ అయ్యింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల .. చాలాసార్లు ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది.

మే 10న విడుదలవ్వడం.. మంచి టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ హిట్ అవ్వలేకపోయింది. దీంతో, నారా రోహిత్ కి ఇంత వరకు బ్రేక్ పడలేదు.. అయితే, నేడు ‘సుందరకాండ’ టీజర్ లాంచ్ లో ” ‘ప్రతినిథి 2’ హిట్ అయ్యింది కదా? ‘ప్రతినిథి 3’ ప్లాన్ చేస్తున్నారా .. ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనికి నారా రోహిత్ జవాబు చెబుతూ.. ” ఎక్కడ హిట్ అయింది.. అసలు ఆ మూవీ వచ్చినట్టు కూడా గుర్తులేదు” అంటూ నవ్వుతూ అన్నాడు. అప్పుడు రిపోర్టర్.. ‘మీరు సూపర్ .. మూవీ హిట్ అవ్వలేదని మీరే చెప్పేస్తున్నారు.. అని అన్నాడు. అది కాదండి నా ఉద్దేశం.. నేను ఇలా అనకపోయినా .. హిట్ అయినా మళ్ళి వెళ్లి ప్లాప్ అనే రాసేస్తారు కదా.. మరి అలాంటప్పుడు నేనే ఫ్లాప్ అని చెప్పుకోవడం మంచిది ’ అంటూ సైటైర్లు వేసాడు .

Advertisement

Next Story