నారా లోకేష్‌కు ముద్దు పెట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

by GSrikanth |
నారా లోకేష్‌కు ముద్దు పెట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
X

దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళవారం సినిమా ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌కు ఆర్జీవీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. మీడియా ప్రతినిధులకు ఎవరికీ తాను ధన్యవాదాలు చెప్పడం లేదని అన్నారు.

కేవలం నా ప్రియ మిత్రుడు లోకేష్‌కు మాత్రమే థాంక్స్ చెబుతానని చెప్పారు. ఇవాళ వ్యూహం చిత్ర బృందం మొత్తం సంతోషంగా ఉందంటే దానికి కారణం లోకేష్‌ అని అన్నారు. డిసెంబర్‌లో సినిమా రిలీజ్ అయి ఉంటే ప్రజలు ఇప్పటికే తమ సినిమాను మర్చిపోయి ఉండేవారని అన్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు విడుదల అయ్యేలా తీవ్రంగా కృషి చేసిన లోకేష్‌కు కృతజ్ఞతలు చెప్పారు. లోకేష్ తెలివైన వ్యూహం తమ సినిమాకు ఫైనాన్షియల్‌గా వర్కౌట్ అవుతుందని అన్నారు.

Advertisement

Next Story