Nani : ‘సరిపోదా శనివారం’ టీజర్ రిలీజ్.. బర్త్‌డే స్పెషల్ మామూలుగా లేదుగా!

by sudharani |   ( Updated:2024-07-20 09:58:23.0  )
Nani : ‘సరిపోదా శనివారం’ టీజర్ రిలీజ్.. బర్త్‌డే స్పెషల్ మామూలుగా లేదుగా!
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘సరిపోదా శనివారం’. DVV ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్.జే సూర్య, సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేస్తుకున్న ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో దూకుడు పెంచారు మేకర్స్.

మూవీ నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులకు ఫుల్ మాస్ ట్రీట్ ఇస్తున్నారు. ఈ మేరకు నేడు SJ సూర్యకు పుట్టినరోజు కావడంతో.. మూవీ నుంచి ‘దిస్ ఈజ్ నాట్ ఏ టీజర్’ అంటూ చిన్న గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. అందులో నాని వాయిస్ ఓవర్‌లో ‘నీడలాంటి చెడు ఎప్పుడైతే బలపడుతుందో దానిని ఆపడానికి మరింత శక్తివంతంగా మంచి పుడుతుంది’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయినా ఇందులో శ్రీకృష్ణుడు (నాని), సత్యభామ (ప్రియాంక మోహన్)తో కలిసి రావణాసురుడు (ఎస్.జే సూర్య)ను ఎదుర్కోవడానికి వస్తున్నట్లు చూపించిన విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అలాగే లాస్ట్‌లో నాని ‘హ్యాపీ బర్త్‌డే సర్’ అనే చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. ఇక ఇందులో క్రూరమైన పోలీసుగా ఎస్.జే సూర్య కనిపించాడు. ప్రజెంట్ ఈ టీజర్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటుంది.


Advertisement

Next Story