త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న నాని హీరోయిన్!

by Anjali |   ( Updated:2023-08-01 12:34:29.0  )
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న నాని హీరోయిన్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత మొదట్లో చిన్న చిన్న పాత్రలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 2008లో రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నచ్చావులే’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో తర్వాత హీరో నాని సరసన ‘స్నేహితుడా’ మూవీలో అవకాశం వచ్చింది. అనంతరం ష్, ఉసురు, అరవింద్-2, తొలిపాట లాంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో ఈ బ్యూటీకి పెద్దగా ఛాన్స్‌లు రాలేదు. దీంతో మాధవీలత తెలుగు హీరోయిన్లకు అస్సలు అవకాశాలు ఇవ్వట్లేదు, టాలీవుడ్‌లో ముంబై హీరోయిన్లకే ఛాన్స్‌లు ఇస్తున్నారంటూ గతంలో ఆరోపణలు కూడా చేసింది.

తర్వాత బీజేపీలో చేరి కొన్ని రోజులు రాజకీయం చేసింది. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. ఇక పాలిటిక్స్ కూడా పక్కన పెట్టేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ హీరోయిన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘నాకు కాబోయే భర్త వివరాలు త్వరలోనే చెబుతానని’ వెల్లడించింది. కాగా మాధవీలతను వివాహం చేసుకునేది హైదరాబాదులోనే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇన్ని రోజులు ఇబ్బందులు పడ్డ, త్వరలోనే ఈ భామ పెద్దింటికి కోడలు అవ్వబోతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: కారులో బట్టలు విప్పి చూపిస్తున్న రీతూ చౌదరి.. అందాలన్నీ లూజ్ అయ్యాయని..

Advertisement

Next Story

Most Viewed