మహేశ్ బాబు భార్య ఎమోషనల్ పోస్ట్.. ఎవరిని మిస్ అవుతున్నారంటే!

by sudharani |   ( Updated:2024-04-21 15:08:28.0  )
మహేశ్ బాబు భార్య ఎమోషనల్ పోస్ట్.. ఎవరిని మిస్ అవుతున్నారంటే!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత గురించి తెలిసిందే. మహేశ్ బాబు ‘వంశీ’ సినమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తర్వాత చిరంజీవి ‘అంజి’, మహేశ్ బాబు ‘టక్కరి దొంగ’ మూవీస్ చేసి ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత మిల్క్ బాయ్ మహేశ్‌తో ప్రేమలో పడిన నమ్రత.. ప్రేమ పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరం అయింది. ఇక అప్పటి నుంచి ఫ్యామిలీ లైఫ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. కుటుంభాన్ని చూసుకుంటూ ఉంటోంది.

అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నమ్రత.. తనకు, తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ నెట్టింట షేర్ చేస్తుంది. ఫ్యామిలీతో కలిసి టూర్లు, వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ అక్కడ దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా నమ్రత పెట్టిన ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన అత్తమ్మ, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవిని తలుచుకుంటూ ఆమె ఫొటో షేర్ చేశారు. అంతే కాకుండా బ్లాక్ కలర్ హాట్ సింబల్‌ను క్యాప్షన్‌గా పెట్టారు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘ఇండస్ట్రీకి ఒక మంచి అబ్బాయిని ఇచ్చావమ్మ థాంక్యూ’ అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.


Read More...

విడాకులు తీసుకోబోతున్న ఐశ్వర్య, అభిషేక్..! ఆ ఒక్క పోస్ట్‌తో క్లారిటీ

Advertisement

Next Story