మా అన్నా, తమ్ముడిని ఏమన్నా అంటే తాటా తీస్తా.. Nagababu వార్నింగ్

by sudharani |   ( Updated:2022-08-22 07:26:54.0  )
మా అన్నా, తమ్ముడిని ఏమన్నా అంటే తాటా తీస్తా.. Nagababu వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ''అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్‌ను ఎందుకు ఇంతలా విమర్శిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. చిరంజీవి ప్రజలకు ఎంతో సహాయం చేశారు. ఏపీ రాజకీయ ముఖ చిత్రం మార్చే దమ్మున్న నాయకుడు పవన్. కుళ్లి పోయిన రాజకీయాలపై అసహనం వ్యక్తి చేసి అప్పుడు అన్నకు మద్దతు ఇచ్చా. ఇప్పుడు తమ్ముడుకి మద్దతు ఇస్తున్నా. చిరంజీవిని, పవన్ కళ్యాణ్‌ను ఏమన్నా అంటే చీల్చేసే అభిమానులు ఉన్నారు. అలాంటి మంచి వాళ్లను కొంతమంది విమర్శిస్తున్నారు. అలాంటి వాళ్లకు నేను గట్టి కౌంటర్ కూడా ఇచ్చాను. అందుకే నన్ను కంట్రావర్సీయల్ పర్సన్ అంటున్నారు. మీరు నన్ను ఏం అనుకున్నా పర్లేదు. మా అన్నను, తమ్ముడిని ఏమన్నా అంటే సహించేదే లేదు.. తాటా తీస్తా'' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

ఇవి కూడా చ‌ద‌వండి :

Vikram 'Cobra' సినిమా ట్రైలర్‌ డేట్ ఫిక్స్..

ఆ రోజును లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేను : Megastar Chiranjeevi ఎమోషనల్

Megastar Vs King Nagarjuna.. దసరా బరిలో గెలిచేదెవరు?

Advertisement

Next Story