నాగ చైతన్య- శోభిత పెళ్లి.. బయటకు వచ్చిన సంచలన అగ్రిమెంట్.. నెట్టింట దుమారం

by Kavitha |
నాగ చైతన్య- శోభిత పెళ్లి.. బయటకు వచ్చిన సంచలన అగ్రిమెంట్.. నెట్టింట దుమారం
X

దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభితతో డేటింగ్‌లో ఉంటూ ఆగస్టు 8న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున ఎక్స్ వేదికగా తెలియజేస్తూ వారి నిశ్చితార్థ ఫొటోలను షేర్ చేశాడు. అయితే ఈ జంట తాజాగా డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో ఈ జంటకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. నాగ చైతన్య- శోభితల వివాహం ఓ అగ్రిమెంట్ ప్రకారం జరిగిందని.. తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో భాగంగా వీరి మ్యారేజ్ టైంలో నాగార్జున వీరితో ఓ అగ్రిమెంట్ రాయించుకున్న ట్లు సమాచారం. ముఖ్యంగా శోభితతో ఈ అగ్రిమెంట్ పై సంతకాలు చేయించుకున్నారట.

భవిష్యత్తులో ఏవైనా కారణాలతో వీరిద్దరూ విడిపోవాల్సి వస్తే ఆస్తిలో సగం వాటా తనకు భరణం కింద ఇవ్వడం కుదరదని నాగార్జున ముందుగానే ఈ అగ్రిమెంట్ చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే మీరిద్దరూ ఎల్లకాలం హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నాము కానీ ఏవైనా కారణాలతో విడిపోవాల్సి వస్తే నాగేశ్వరరావు సంపాదించిన ఆస్తిలో ఏమాత్రం వాటా ఇవ్వడం కుదరదని, నాగచైతన్య సంపాదించిన ఆస్తిలో మాత్రమే భరణం కింద ఎంత చెల్లించాల్సి ఉంటుందో అది మాత్రమే నీకు చెందుతుందని ఓ అగ్రిమెంట్ చేయించి నాగార్జున సంతకాలు తీసుకున్నారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఈ వార్త బాగా హల్ చల్ చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed