ప్లీజ్ మా ఇద్దరినీ వదిలేయండి.. రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు

by Aamani |   ( Updated:2023-05-09 12:57:48.0  )
ప్లీజ్ మా ఇద్దరినీ వదిలేయండి.. రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు
X

దిశ, సినిమా : సమంతతో విడాకుల ఇష్యూపై మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు నాగ చైతన్య. కొంతకాలంగా ఎక్కడికెళ్లినా డైవోర్స్ ప్రశ్నలే ఎదురవుతున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన హీరో.. ఇకనైనా ఆ విషయాన్ని వదిలేయాలని కోరుతున్నాడు. తన రాబోయే ‘కస్టడీ’ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చైతు.. కోర్టు తమ విడాకులు మంజూరు చేసి ఏడాది గడుస్తున్నా కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ఇదే విషయాన్ని హైలెట్ చేయడం బాధకరమన్నాడు. అయితే తమ సినిమాల గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా పెద్దగా ఇబ్బందిగా అనిపించదన్న ఆయన.. వ్యక్తిగత విషయంపైనే రూమర్స్ క్రియేట్ చేస్తూ తమ గౌరవవాన్ని తీసేస్తున్నారని బాధపడ్డాడు. ఇకనైనా తమ ప్రమేయం లేకుండా పర్సనల్ టాపిక్‌ను సాగదీయడం ఆపేయాలని సూచించాడు. ‘సామ్, నేను డైవోర్స్‌పై క్లారిటీ ఇచ్చేశాం. ఇకనైనా విడాకుల డిస్కషన్ వదిలేస్తారని ఆశిస్తున్నా’ అంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు

Also Read..

సమంత నుంచి ఎక్కువ ఆశిస్తే నిరాశే మిగులుతుంది!

Advertisement

Next Story