పుష్ప-2పై కన్నేసిన నాని, చైతూ .. ఎందుకంటే?

by Jakkula Samataha |
పుష్ప-2పై కన్నేసిన నాని, చైతూ .. ఎందుకంటే?
X

దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తున్నారు. దీనికి పార్ట్ 3 కూడా ఉంటుందా అని తెగ ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. అయితే బన్నీ ఫ్యాన్స్ మూవీ 2023లోనే విడుదల చేస్తారని ఆశగా ఎదురు చూశారు. కానీ అనుకోని విధంగా మూవీ టీం సినిమాను 2024 ఆగస్టు 15న విడుదల చేయనున్నాం అని ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతో మూవీ లవర్స్ కాస్త నిరాశకు లోను అయ్యారు. అయితే ఏదైనా కారణం వలన పుష్ప2 మూవీ వాయిదా పడితే, ఆ రోజున తమ సినిమాలను విడుదల చేయాలని నాగచైతన్య, నాని చూస్తున్నారంట. ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో తడేల్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. అలాగే న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే పుష్ప2 మూవీ పోస్ట్ పోన్ అయితే నాని లేదా చై తమ మూవీస్ విడుదల చేయడానికి రెడీగా ఉన్నారని ఇండస్ట్రీలో టాక్.

Advertisement

Next Story