తనకు అది ఎక్కువ.. సమంతపై సంచలన కామెంట్స్ చేసిన నాగ చైతన్య..?

by Anjali |   ( Updated:2023-11-09 07:20:18.0  )
తనకు అది ఎక్కువ.. సమంతపై సంచలన కామెంట్స్ చేసిన నాగ చైతన్య..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ.. అక్కినేని నాగచైతన్య కొన్ని ఏళ్ల పాటు ప్రేమలో ఉండి, ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. 4 ఏళ్లు గడవకముందే మనస్పర్థాల కారణంగా విడిపోయారు. డివోర్స్ అనంతరం తాము మంచి ఫ్రెండ్స్‌గా ఉంటామని చెప్పిన ఈ జంట.. ఇప్పటివరకు ముఖముఖాలు కూడా చూసుకోలేదు. చైతన్య సినిమా షూటింగ్‌లో బిజీ అవ్వగా.. సామ్ మయోసైటిస్‌తో బాధపడుతూ ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. ఇకపోతే నాగ చైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూరు హాజరై.. మాజీ భార్య సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మీరు నటించిన హీరోయిన్స్‌లో మీకు నచ్చిన లక్షణాలు ఏంటి? అని ప్రశ్నంచగా.. కృతి శెట్టి, పూజా హెగ్డే, సమంత గురించి చెప్పుకొచ్చాడు. సమంత గురించి మాట్లాడుతూ.. ‘‘సమంత ఏదైనా చేయాలనుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆ పని కంప్లీట్ చేస్తుంది. తనకు విల్ పవర్ ఎక్కువ. హార్డ్ వర్కర్’’ అంటూ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కానీ సమంత గతంలో బాలీవుడ్ ఇంటర్వ్యూలో చై గురించి అడగ్గా.. ‘అతను తన మాజీ భర్త.. ఇద్దరం ఒకే గదిలో ఉంటే కత్తితో పొడుస్తాను’ అని చై గురించి దారుణంగా చెప్పుకొచ్చింది. సమంతకు, నాగచైతన్యకు ఉన్న తేడా ఇది. చైతూ ఫ్యాన్స్ చైను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed