సామ్ తప్ప మరో ఆప్షన్ వద్దు.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన చైతూ.. మళ్లీ కలవనున్నారా?

by Anjali |
సామ్ తప్ప మరో ఆప్షన్ వద్దు.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన చైతూ.. మళ్లీ కలవనున్నారా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత అండ్ అక్కినేని హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వీరిద్దరు ‘ఏం మాయ చేశావే’ చిత్రంలో కలిసి నటించిన సమయంలో ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదారేళ్లు ప్రేమలో ఉండి.. తర్వాత కుటుంబీకుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సమంత పూర్తిగా సినిమాలకు దూరమవ్వనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

కానీ ఈ అమ్మడు ఫ్యాన్స్ కు ఊహించని రేంజ్ లో ‘ఊ అంటావా మావా’ అనే ఐటెం సాంగ్‌కు స్టెప్పులేసి అక్కినేని ఫ్యామిలీలో అండ్ అక్కినేని అభిమానుల్లో కాస్త చెడ్డ పేరు తెచ్చుకుందని.. ఈ కారణంగానే చైతన్యకు దూరమైందని టాక్ వినిపించింది. అయితే సామ్ - చైతూ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న క్రమంలో ప్రదీప్ యాంకర్ ‌గా నిర్వహించిన ఓ షోలో నాగచైతన్య పాల్గొన్నాడు. ఇక షో లో నుంచి చైతూ.. సామ్‌కు కాల్ చేసి.. ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలు ఉండగా నేను సామ్ నే ఎందుకు ప్రేమించాను అని అడుగుతాడు.

దీనికి సమంత బదులిస్తూ నీకు ఇంకో ఆప్షన్ లేదని అంటుంది. అప్పుడు చైతన్య అవును నాకు నువ్వు తప్ప మరో ఆప్షన్ వద్దని చెబుతాడు. ప్రస్తుతం ఈ వీడియోను సామ్-చైతూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేయగా.. మీరిద్దరు కలిస్తే చూడాలని ఉంది. చైతన్య నిజంగానే సమంతను తప్ప మరో అమ్మాయిని ఇప్పటివరకు ప్రేమించలేదు. చైతూ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండటానికి కారణం అదే. మళ్లీ కలుస్తారేమో అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed