Naga Chaitanya: 2027లో నాగచైతన్య, శోభిత విడిపోతారన్న వేణుస్వామి.. గట్టి కౌంటర్ ఇచ్చిన చైతన్య (వీడియో)

by sudharani |
Naga Chaitanya: 2027లో నాగచైతన్య, శోభిత విడిపోతారన్న వేణుస్వామి.. గట్టి కౌంటర్ ఇచ్చిన చైతన్య (వీడియో)
X

దిశ, సినిమా: తాజాగా నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటన్నిటి కొట్టిపడేసిన ఈ జంట.. ఫైనల్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే.. వీళ్లిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేరని.. 2027 నుంచి చై, శోభిత వివాహ బంధంలో మార్పులు వస్తాయి. వీళ్లు కూడా విడిపోయే చాన్స్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ వేణుస్వామి బిగ్ బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా.. సమంత-చైతన్య జంటకి 100కి 50 మార్కులు ఇస్తాను. చైతన్య-శోభిత జంటకి 100కి 10 మార్కులు కూడా ఇవ్వలేనంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఈ వీడియో నెట్టింట పెద్ద సంచలనమే సృష్టించింది.

దీంతో కొంత మంది వేణుస్వామికి పాజిటివ్‌గా కామెంట్స్ పెడితే.. చై ఫ్యాన్స్ మాత్రం ఏకిపారేస్తున్నారు. శుభమా అని ఎంగేజ్‌మెంట్ చేసుకుంటే అపశకునంగా మాట్లాడాతావు ఏంటీ అని మండిపడితున్నారు. ఈ క్రమంలో వేణు స్వామి వీడియోకు నాగచైతన్య కౌంటర్ ఇచ్చినట్లుగా ఓ వీడియో ట్రెండ్ చేస్తున్నారు. అయితే.. అది ఓల్డ్ వీడియో. అందులో రానా దగ్గుబాటి నాగచైతన్యను ‘నువ్వు జాతకాలు నమ్ముతావ’ అని ప్రశ్నిస్తాడు. దానికి చైతన్య ‘జాతకాన్ని నమ్మడం, నమ్మకపోవడం నా కన్వీనియన్స్‌పై (సౌలభ్యం) ఆధారపడి ఉంటుంది. జాతకం బావుందంటే ఓకే నమ్ముతా లేకపోతే అసలు పట్టించుకోను’ అన్నట్లుగా చెప్పాడు. వేణు స్వామి రిలీజ్ చేసిన ఈ వీడియోకు నాగచైతన్య ఓల్డ్ వీడియోను జత చేసి.. ఇదే వేణుస్వామికి గట్టి కౌంటర్ అంటూ నెట్టింట వైరల్ చేస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed