వారితో దిగిన ఫోటో షేర్ చేసి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్

by Kavitha |
వారితో దిగిన ఫోటో షేర్ చేసి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. 600 కోట్ల బడ్జేట్‌తో ఈ సినిమాని నిర్మించగా ఇప్పటికే 500 కోట్ల కలెక్షన్స్ దాటి దూసుకుపోతుంది. ఈ సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ అన్ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను తెగ పొగిడేస్తున్నారు. అయితే కల్కి నిర్మాత అశ్విని దత్ చిన్న కూతురు ప్రియాంక దత్, నాగ్ అశ్విన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రియాంక దత్, స్వప్న దత్ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కూడా ఇప్పుడు నిర్మాణ పనులు చూసుకుంటున్నారు. తాజాగా కల్కి ఇంత పెద్ద హిట్ అవ్వడంతో నాగ్ అశ్విన్ తన భార్య ప్రియాంక దత్, వదిన స్వప్న దత్‌లతో దిగిన ఫోటో షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

ఆ పోస్ట్‌లో భాగంగా.. సుమారు పదేళ్ల క్రితం మేము ముగ్గురం కలిసి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను ప్రారంభించాము. అప్పుడు వైజయంతి సంస్థ కష్టాల్లో ఉంది. కానీ బాగా రిస్క్ తీసుకుని ఆ సినిమాని తీస్తున్నాము. నాకు బాగా గుర్తింది ఒకరోజు 20 మందిని తీసుకొచ్చి షూట్ చేశాము. కానీ అప్పుడు వర్షం పడి షూట్ ఆగిపోయింది. ఆ వర్షం వల్ల మొత్తం సెటప్ మళ్లీ చేయాల్సి వచ్చింది. దాంతో ఖర్చు కూడా ఎక్కువైంది. అప్పుడు మేము మస్తు భయపడ్డాము. ఇప్పుడు పదేళ్ల తర్వాత మేము కలిసి చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అవడమే కాక చరిత్రలో ఒక మంచి గుర్తింపుతో నిలిచాయి. ఈ ఇద్దరి సపోర్ట్ నాకు ఉన్నందుకు నేను గర్వ పడుతున్నాను. సాధించలేని విషయాలను సాధించి చూపించాము. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ముందు ముందు చాలా ఇంప్రూవ్ చేసుకుంటాము.. ప్రస్తుతానికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed