నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. తప్పకుండా దీనిపై క్లారిటీ ఇస్తా.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

by sudharani |
నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. తప్పకుండా దీనిపై క్లారిటీ ఇస్తా.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘కాంతార’. 2022 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. అంతే కాకుండా.. ఇందులో రిషభ్ శెట్టి నటనకుగాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది. ప్రజెంట్ ‘కాంతార’కు సీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉండగా.. దీనికోసం రిషబ్ శెట్టి కలరియపట్టు యుద్ధ విద్యలో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ వేదికపై బాలీవుడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘కొన్ని భారతీయ సినిమాలు ముఖ్యంగా బాలీవుడ్‌ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి. మన చిత్రాలను గ్లోబల్‌ ఈవెంట్‌లకు ఆహ్వానిస్తారు. రెడ్‌ కార్పెట్‌ వేస్తారు. అందుకే నేను దేశం గురించి గర్వంగా మాట్లాడేలా చేయాలనుకుంటున్నా. నా దేశం.. నా రాష్ట్రం.. నా భాష వీటన్నిటి గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా’ అని తెలిపారు. అయితే.. ఈ కామెంట్స్‌ను కొంత మంది తప్పుపడుతూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఐఫా’ వేడుకలో పాల్గొన్న రిషబ్ శెట్టిని దీనిపై క్లారిటీ ఇవ్వాలని మీడియా కోరింది. దీనిపై రిషబ్ శెట్టి స్పందిస్తూ.. ‘నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నా కామెంట్స్‌ని తిప్పి రాశారు. నా ఉద్దేశం అది కాదు. తప్పకుండా ఈ విషయంపై నేను క్లారిటీ ఇవ్వాలి. అప్పుడు దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story