Kajal Aggarwal : నా కొడుకు నీల్ నుంచి ప్రేమించడం నేర్చుకుంటున్నా..

by Prasanna |   ( Updated:2023-02-15 10:38:34.0  )
Kajal Aggarwal : నా కొడుకు నీల్ నుంచి ప్రేమించడం నేర్చుకుంటున్నా..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. దాదాపు స్టార్ హీరోలతో నటించి తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక మొదటి లాక్‌డౌన్‌లో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. కొద్ది నెలల్లోనే ప్రెగ్నెన్సీని కూడా అనౌన్స్ చేసి ఏప్రిల్ 19న 2022న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే నిన్న వాలెంటైన్స్ డే సందర్భంగా భర్తతో ఓ రొమాంటిక్ పిక్‌ని షేర్ చేసి కొడుకు గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'ఎప్పటికీ సూర్యుడిలా వెలిగిపోతూ ఉండే వాడు నా కొడుకు నీల్ కిచ్లు. నాకు వాడు చాలా విలువైన వాడు. వాలెంటైన్‌లు నాకు ఇంకా ముగియలేదు. నీల్ కిచ్లూ నాకు ప్రేమలోని అర్ధాన్ని ప్రతిరోజూ ఏదోరకంగా భోదిస్తునే ఉన్నాడు' అంటూ తన ప్రేమను చాటుకుంది.

Advertisement

Next Story

Most Viewed