- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నో సవాళ్లు ఎదురుకున్నా.. ఆమెనే నా ధైర్యం: సారా అలీఖాన్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్ లలో సారా అలీఖాన్ ఒకరు. అందరిలా తోండరపాటుతో కాకుండా కెరీర్‌లో ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేస్తూ ముందుకు వెళ్తుంది. రీసెంట్ గా ఆమె నటించిన ‘మర్డర్ ముబారక్’ సినిమా ఓటీటీలో మంచి హిట్ సాధించింది. ప్రజంట్ ఆమె ‘యే వతన్ మేరే వతన్’ చిత్రంలో నటిస్తున్నది. ఇక పోతే నటుడు సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ ముద్దుల కూతురు అయిన సారా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాళ్ళ అమ్మ గురించి చెబుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది..
‘ఆడిందే ఆటగా నా బాల్య ఏం సాగలేదు. అమ్మ నాన్న విడిపోవడంతో.. నేను మా అమ్మ దగ్గరే ఎక్కువగా పెరిగాను. నా ధైర్యం మా అమ్మే..! ఎందుకంటే సింగిల్ మదర్‌కు ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటిని అమ్మ అధిగమించి, నన్ను పెంచిన తీరు ఎప్పటికీ మర్చిపోలేను. అమ్మ పెంపకంలో నేను ఇండిపెండెంట్‌గా పెరిగాను. మన కోసం ఎవరో వచ్చి, ఏదో చేస్తారని అనుకోవద్దని చిన్నప్పుడే నాకు అర్థమైంది. అలా నా ధైర్యానికి కారణం అమ్మ. పరిస్థితులకు తగ్గట్టుగా ఉండగలగడం చెప్పినంత తేలిక కాదు. అని సార్లు మనం అనుకున్నట్టుగా ఏది జరగకపోవచ్చు. అలాంటప్పుడు కోపం, చిరాకు కలుగుతాయి. కానీ, ఒక సమస్యను మనం తీసుకునే నిర్ణయాలన బట్టి దాని పరిష్కారం ఉంటుంది. ఆ పరిస్థితులను అర్థం చేసుకునే శక్తియుక్తులని నేను మా అమ్మ దగ్గరి నుండే నేర్చుకున్నాను’ అంటుంది సారా అలీఖాన్.
Read More..
గోల్డెన్ బ్యూటీగా సమంత..సోఫాలో పడుకొని రొమాంటిక్ ఫోజులు?