నా కూతురికి ఎలాంటి ట్యాగ్‌లు వద్దు.. ఉపాసన సంచలన కామెంట్స్

by Anjali |   ( Updated:2023-07-21 11:07:40.0  )
నా కూతురికి ఎలాంటి ట్యాగ్‌లు వద్దు.. ఉపాసన సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్ తాజాగా తన కుమార్తె క్లీంకారకు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోలో చరణ్-ఉపాసన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఇందులో ఎన్నో అద్భుతమైన విజువల్స్‌ను చూపించడంతో పాటు ఉపాసన డెలివరీ రోజున, మెగా ప్రిన్సెస్‌కు నామకరణం రోజున తీసిన షాట్స్‌ను చూపించారు. ఇక, ఈ వీడియోలో చరణ్ మాట్లాడుతూ.. ‘క్లీంకార జన్మించే టైంలో మా అందరిలో ఏదో తెలియని ఆందోళన, అంతా సరిగ్గా జరగాలని మేమంతా దేవుడిని కోరుకున్నాం.

అనుకున్నట్లుగానే మా ప్రిన్సెస్ ఈ లోకంలోకి అడుగు పెట్టింది. నా బంగారు తల్లి పుట్టిన క్షణాన చాలా హ్యాపీగా అనిపించిందంటూ చరణ్ చెప్పుకొచ్చాడు. ‘మా పాప ద్రవిడ సంస్కృతిలో భాగం కావాలని కోరుకుంటున్నాం. క్లీంకార నేమ్‌కు ముందు, వెనక ఎలాంటి ట్యాగ్స్ పెట్టవద్దు. ఆ ట్యాగులను వారికి వారే స్వయంగా సంపాదించుకోవాలని అనుకుంటున్నాని’ ఉపాసన తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Read more : disha newspaper

Movie News & Gossips




Advertisement

Next Story

Most Viewed