Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌తో డేటింగ్‌పై.. క్లారిటీ ఇచ్చిన సింగర్ బాద్‌షా పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-11-14 08:17:14.0  )
Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌తో డేటింగ్‌పై.. క్లారిటీ ఇచ్చిన సింగర్ బాద్‌షా పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సీతారామం బ్యూటీ మృణాల్ ఇటీవల నిత్యం వార్తల్లో నిలిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు గ్లామర్ ఫొటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది. అలాగే వరుస చిత్రాల్లో ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. గత కొద్ది కాలంగా ఆమె పెళ్లి చేసుకుంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఇటీవల మృణాల్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. అయితే దీపావళి సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి పార్టీ ఏర్పాటు చేసింది.

దీనికి మృణాల్ బాలీవుడ్ ర్యాపర్ బాద్‌షాతో కలిసి వెళ్లింది. అంతేకాకుండా అతడి చేతిలో చేయి వేసి మరీ అతన్ని పట్టుకున్న ఫొటో నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అది చూసిన నెటిజన్లు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా, దీనిపై బాద్‌షా ఇన్‌స్టా వేదికగా స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘‘మిమ్మల్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి. మీరు అనుకుంటున్నట్లు అలాంటిదేం లేదు’’ అని రాసుకొచ్చాడు. అయితే బాద్‌షా, మృణాల్‌తో డేటింగ్ గురించి చెప్పడానికే ఇలాంటి పోస్ట్ పెట్టాడని నెటిజన్లు అనుకుంటున్నారు.




Advertisement

Next Story