హాయ్ నాన్న థర్డ్ సింగిల్‌లో మృణాల్-నాని కెమిస్ట్రీ అదిరిపోయిందిగా!

by Anjali |
హాయ్ నాన్న థర్డ్ సింగిల్‌లో మృణాల్-నాని కెమిస్ట్రీ అదిరిపోయిందిగా!
X

దిశ, వెబ్‌డెస్క్: నాని-మృణాల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘హయ్ నాన్న’ చిత్రం కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజైన టీజర్ అండ్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫస్ట్ సింగిల్ ‘సమయమా’ పాటలో నాని, మృణాల్ మధ్య లవ్, బాండింగ్ చూపించారు. రెండో పాట ‘గాజు బొమ్మ’ లో తండ్రి, కుమార్తె పంచుకునే అందమైన అనుబంధాన్ని హృదయాన్ని హత్తుకునేలా చూపించారు. తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్ అప్‌డేట్ కూడా ఇచ్చేశారు. ‘అమ్మాడి’ అంటూ సాగే ఈ పాటలో నాని-మృణాల్ మధ్య కెమిస్ట్రీ ఓ లెవల్‌లో ఉంది. పోస్టర్‌ను బట్టి చూస్తుంటే ఇది రొమాంటిక్ సాంగ్ అని అర్థమయిపోతుంది. ఈ సాంగ్ నవంబరు 4వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story