- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మిస్టర్ సెలెబ్రిటీ' వినోదాన్ని పంచుతుంది
దిశ, సినిమాః ‘ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ మనవడు సుదర్శన్ పరుచూరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మిస్టర్ సెలబ్రిటి'. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. అక్టోబర్ 4న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఇటీవల రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా మనవడు పరుచూరి సుదర్శన్ నటించిన మిస్టర్ సెలెబ్రిటీ అక్టోబర్ 4న రాబోతుంది. మమ్మల్ని ఆదరించినట్టుగానే మా మనవడ్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చిత్రంలోని వినోదం అందర్ని అలరిస్తుంది. కొత్త దర్శకుడైనా కూడా సినిమాను బాగా తీశారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది' అన్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘మమ్మల్ని ప్రేక్షకులు ఈ నలభై ఏళ్లుగా ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మా మనవడు పరుచూరి సుదర్శన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మా మనవడ్ని ఆదరించి ఈ సినిమాను విజయవంతం చేయండి’ అని కోరారు.