మళ్లీ కలవబోతున్న ప్రభాస్, త్రిష.. ఆనందంలో ఫ్యాన్స్

by samatah |   ( Updated:2022-12-06 07:03:43.0  )
మళ్లీ కలవబోతున్న ప్రభాస్, త్రిష.. ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రభాస్, త్రిషల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు కలిసి నటించిన వర్షం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా వీరి కెమెస్ట్రీకి కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో చాలా మంది అభిమానులకు ఈ జంట అంటే ఇష్టం. ఇక వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఏ సినిమానైనా ప్రేక్షకులు అమితంగా ఇష్టపడేవారు అనడంలో అతిశయోక్తి లేదు.

ప్రభాస్, త్రిష.. వర్షం, పౌర్ణఒకమి బుజ్జిగాడు సినిమాలో నటించి సక్సెస్ అందుకున్నారు. కాగా, చాలా రోజుల తర్వాత వీరు మళ్లీ జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు.

కాగా, ఈమూవీ ఇప్పటికే ఫస్ట్ పార్ట్ కంప్లీట్ కాగా, తర్వలో రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం. అందులో మూడో హీరోయిన్‌గా త్రిష నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్, త్రిష ప్రేమించుకున్నారని, త్వరలో వారు పెళ్లి చేసుకోబుతున్నారంటూ చాలా కథనాలు వచ్చాయి. అంతే కాకుండా చాలా మంది వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారు, కానీ అది జరగలేదు. ఇక అలనాటి ప్రేమికులు మళ్లీ తెరపై కనిపించబోతున్నారు అని తెలియడంతో అభిమానులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : విజయ్ దేవరకొండ తల్లితో జాన్వీ కపూర్.. పిక్స్ వైరల్

Advertisement

Next Story