- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పుష్ప2’ లో ఐటమ్ సాంగ్‌కి మొస్ట్ వాంటెడ్ బ్యూటీ ఫిక్స్..
దిశ, సినిమా: ‘పుష్ప’ సినిమా పాన్ ఇండియా వైడ్ ఎంత భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఈ మూవీ సాంగ్స్, తగ్గేదేలే అంటూ చెప్పిన డైలాగ్స్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన ఐటమ్ సాంగ్స్‌లో ది బెస్ట్ అంటే ఈ సినిమా లోని ‘ఊ అంటావా మావా.. ఉ..ఉ.. అంటావా మావా..’ పాటే అని చెప్పాలి. ఆ పాటలో సమంత స్క్రీన్ ప్రెజన్స్ మామూలుగా లేదు. తన అందంతో అభినయంతో యువతరాన్ని ఉర్రూతలూగించింది. దాదాపు పబ్స్ లో ఈ పాట కచ్చితంగా మోగాల్సిందే.
దీంతో ‘పుష్ప2’ లో కూడా ఐటమ్‌నంబర్‌కి ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఉండాలని ప్లాన్ చేశాడట సుకుమార్. అయితే ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చినప్పటికి చివలకు ఈ అవకాశం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ Disha Pataniకి దక్కింది. అంతేకాదు ఈ వారంలోనే దిశాతో ఐటమ్‌సాంగ్ చిత్రీకరించనున్నారట సుకుమార్. కాగా ఈ దిశ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ బిజీ హీరోయిన్ లలో ఒకరని చెప్పాలి . ఈ అమ్మడు చేతిలో త్వరలో విడుదల కానున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏ.డి’, సూర్య ‘కంగువ’ వంటి చిత్రలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాల్లో దిశ హీరోయిన్ గా నటిస్తోంది.