- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Netflix: ఓటీటీలోకి మోస్ట్ డిస్ట్రబింగ్ మూవీ.. ఏకంగా మనిషి తన సాటి మనిషినే చంపేసి మాంసాన్ని తినే సిట్యువేషన్..
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో ఓటీటీ హవా ఎంతగా నటుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్లలో విడుదలైన 20 నుంచి 25 రోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి జనాలు కూడా థియేటర్స్‌కి వెళ్లి మూవీ చూడటానికి అంత ఇష్టపడట్లేదు. అయితే వీటిలో ఉండే మూవీస్ కూడా వివిధ జోనర్లలో ఉంటాయి. అందులో సస్పెన్స్, హారర్, ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్, సోషల్ ఇన్స్పైర్, మోస్ట్ డిస్ట్రబెన్స్ మూవీ అంటూ పలు రకాల జోనర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్ట్రబెన్స్ మూవీ ఒకటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగనీ ఇది అందరూ చూసే సినిమా అయితే కాదండోయ్. ఎందుకంటే మరీ దారుణమైన సీన్స్‌తో, డిస్ట్రబింగ్ విజువల్స్‌తో ఉండే డిఫరెంట్ మూవీ. అందులోనూ భయపడము అని అనుకునే వాళ్ళు మాత్రమే దీన్ని ట్రై చేయొచ్చు. పొరపాటున ఫ్యామిలీతో గానీ తింటున్నప్పుడూ కానీ 'ద ఫ్లాట్‌ఫామ్' మూవీని చూడొద్దు.
ఇక కథ విషయానికి వస్తే..
గోరెంగ్, త్రిమగాసి అనే ముసలివాడు ఓ గుహ లాంటి గదిలో ఉంటారు. అయితే ఒకరోజు గోరెంగ్ అప్పుడే నిద్ర లేస్తాడు. అలా లేసిన ఆ వ్యక్తికి త్రిమగాసి అనే వృద్ధుడు అసలు అక్కడ ప్రతిరోజూ ఏం జరుగుతుందనేది వివరిస్తాడు. త్రిమగాసి మాట్లాడుతూ.. పెద్ద బిల్డింగ్‌లో ఫ్లోర్స్‌లా ఉండే ఆ గుహలో, గదికి ఇద్దరు చొప్పున మనుషులు ఉంటారని, ప్రతిరోజూ ఒక్కసారే ఆహారంతో ఉన్న ఫ్లాట్‌ఫామ్ ప్రతి ఫ్లోర్‌లో రెండు నిమిషాలు ఆగుతుందని, పై ఫ్లోర్స్‌లో ఉండే వాళ్లు మిగిల్చిన ఆహారాన్ని మనం తిని బతకాల్సి ఉంటుందని చెబుతాడు. ఇక ఇంతకీ వీళ్లు జైలు లాంటి గుహలో ఎందుకు ఉన్నారు? ఇక్కడ మనుషులు తోటి మనుషుల్ని ఎందుకు చంపి తినాల్సి వచ్చింది? చివరకు గోరెంగ్ బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ.
మూవీ ఎలా ఉందంటే..
ఒక మనిషి విచక్షణ కోల్పోయి ఆహారాన్ని వేస్ట్ చేస్తే.. తిరిగి అది తన ప్రాణాల మీదకే ఎలా వస్తుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమానే 'ద ఫ్లాట్‌ఫామ్'. ఈ సినిమాలో దాదాపు 333 ఫ్లోర్స్‌లో ఇద్దరు చొప్పున ఉంటారు. డైలీ వీళ్లలో ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ఫుడ్‌ని పై ఫ్లోర్‌లోనే తయారు చేసి కిందకు పంపిస్తారు. కానీ పైపై ఫ్లోర్స్‌లో ఉన్నోళ్లు తమకు ఇచ్చిన ఫుడ్ మాత్రమే తినకుండా పక్కనోళ్ళ ఫుడ్ కూడా తినేస్తుంటారు. దీంతో కింద ఫ్లోర్స్‌లో వాళ్లకి ఆహారం దొరకదు. దీంతో ఆకలితో ఉన్న మనిషి ఏం ఉన్నా సరే తిందామని ఫిక్స్ అయి వారిలో ఉన్న జంతు ప్రవృత్తి బయటకు వస్తుంది. అలా కింద ఫ్లోర్స్‌లోని వ్యక్తులు బతకడం కోసం తమ గదిలోనే ఉంటున్న తోటి మనిషిని చంపేసి వాళ్ల శరీరంలోని మాంసాన్ని కొద్ది కొద్దిగా తింటూ నెలంతా బతికేస్తుంటారు. ఇలాంటి చోటుకు గోరెంగ్ అనే వ్యక్తి స్వచ్ఛందంగానే వస్తాడు. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్న ఇతను కూడా ఫుడ్ దొరక్కపోయే సరికి రెండుసార్లు తన రూమ్మేట్స్‌ని చంపి తినేస్తాడు. అలా చివరకు ఈ జైలు లాంటి గుహ నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే క్లైమాక్స్.