ప్రభాస్ బావ ‘కల్కి’ చూశానంటూ.. ట్వీట్ చేసిన మోహన్ బాబు

by Prasanna |   ( Updated:2024-07-01 05:43:48.0  )
ప్రభాస్ బావ ‘కల్కి’ చూశానంటూ.. ట్వీట్ చేసిన మోహన్ బాబు
X

దిశ, సినిమా: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘కల్కి2898AD’. దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేస్తుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సినీ ప్రముఖులు, ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికే ఈ సినిమాపై ప్రశంసలు కురిపించగా తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా సినిమా చూసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా “కల్కి” చిత్రాన్ని ప్రశంసించారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. .” ఈ రోజే ‘కల్కి’ మూవీ చూశాను. మహాద్భుతం.. మా బావ ప్రభాస్‌కి, అమితాబ్‌ బచ్చన్‌ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు" అంటూ రాసుకొచ్చారు. అయితే, ఆ ట్వీట్‌లో ప్రభాస్‌ని తన బావగా పేర్కొన్నాడు. మోహన్ బాబు ప్రభాస్ ను తన బావ అని ముద్దుగా పిలుస్తాడు.

బుజ్జిగాడు మూవీలో వీరిద్దరూ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిషకి అన్నయ్యగా మోహన్ బాబు నటించారు. అంటే ప్రభాస్ బావమరిది. ఈ మూవీ క్లైమాక్స్‌ లో ప్రభాస్, మోహన్ బాబుని బావ అని కూడా పిలుస్తాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. మోహన్ బాబు నిజ జీవితంలో కూడా ప్రభాస్ ని తన బావగా పిలుస్తుంటాడు.

Advertisement

Next Story

Most Viewed