నేను సోమరినే.. ఆ పని కూడా చేసుకోలేకపోతున్నా

by Anjali |   ( Updated:2023-07-04 09:05:45.0  )
నేను సోమరినే.. ఆ పని కూడా చేసుకోలేకపోతున్నా
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మిథిలా పాల్కర్.. ఇండస్ట్రీలో తనకంటే సోమరి ఎవరూ లేరంటోంది. అంతేకాదు ఫ్యామిలీతోపాటు స్నేహితుల్లోనూ తానే లేజీ గర్ల్‌గా అని చెప్పింది. రీసెంట్‌గా నెట్టింట తన ఫ్యాన్స్‌తో ముచ్చటించిన నటి.. తన దినచర్య, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నిజానికి నేను చాలా సోమరి. బయటకు కనిపించేంత యాక్టివ్ కాదు. నా ఇంట్లో ఎక్కడ చూసినా వాటర్ బాటిల్స్ కనిపిస్తాయి. ఎందుకంటే కూర్చున్న దగ్గరినుంచి లేవలేను. వంటగదిలోకి వెళ్లి నీళ్లు తాగడం కూడా బద్ధకమే. అందుకే ప్రతి వస్తువు, ఫుడ్ అందుబాటులో ఉంచుకుంటా. బయటకు వెళ్లినపుడు అన్నీ బ్యాగులో పెట్టుకుంటా. దేనికోసం వెతకే ఓపిక ఉండదు’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే సోషల్‌ మీడియాకు తన జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉందన్న బ్యూటీ.. ఫలానా సినిమాలే చేయాలనే హద్దులు పెట్టుకోలేదని, ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ తన టాలెంట్ నిరూపించుకుంటానంటోంది.

Read More..

ఈమెలా అంతా ఎవరైనా చూపిస్తారా ...నెటిజన్ల ఫైర్​

నాకు ఇష్టంలేకున్నా అతడే బలవంతంగా ముద్దుపెట్టాడు.. ఆకాంక్ష


click Here for Mithila Palkar Instagram links

Advertisement

Next Story

Most Viewed