- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Megastarను ఘోరంగా బోల్తా కొట్టించిన ఘనుడు.. అదే వ్యక్తి చేతిలో ఇప్పటికే మోసపోయిన ముగ్గురు అగ్ర హీరోలు..!
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు చాలా సుపరిచితం. కథల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తాడు ఈ స్టార్ హీరో. ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందనే చెప్పాలి. అయితే డైరెక్టర్ మెహర్ రమేశ్ గురించి తెలిసి కూడా చిరంజీవి ఆయనకు ఎలా అవకాశం ఇచ్చారనేది సస్పెన్స్. తెలుగులో ఇప్పటి వరకు ఈ డైరెక్టర్ 5 సినిమాలు మాత్రమే చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే అందులో యాక్ట్ చేసిన హీరోలంతా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవారే. మరీ స్టోరీల విషయంలో జాగ్రత్తలు తీసుకునే ఈ స్టార్ హీరోలు ఈ డైరెక్టర్ చేతికి ఎలా చిక్కారనేది అర్థం కావడం లేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (కంత్రి, శక్తి)
2007లో యమదొంగ మూవీతో భారీ హిట్ అందుకున్న యంగ్ టైగర్.. అదే జోష్‌లో 2008లో కంత్రి మూవీకి కమిట్ అయ్యాడు. ఈ మూవీని డైరెక్ట్ చేసిన మెహర్ రమేశ్‌కు తెలుగులో ఇది మొదటి సినిమా. భారీ అంచానాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఆ తర్వాత అదుర్స్, బృందావనం మూవీస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన యంగ్ టైగర్.. శక్తి మూవీతో మరోసారి మెహర్ రమేశ్ చేతికి చిక్కాడు. కంత్రి ఎలాగో పోయింది కదా.. ఈ సారైన హిట్ కొడదాం అనుకున్నాడో ఏమో తెలియదు గానీ.. చివరకు బొక్కబోర్లా పడాల్సి వచ్చింది. అందులోనూ శక్తి మూవీని సుమారు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారని టాక్. తెలుగు మూవీలో అప్పట్లో మగధీర తర్వాత అంతటి భారీ బడ్జెట్ మూవీ ఇదే అని చెప్పాలి. ఇక ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించిన అశ్వినీదత్ నష్టాల నుంచి కోలుకోవడానికి కొన్ని ఏండ్లు పట్టింది.
ప్రభాస్ (బిల్లా)
యంగ్ రెబల్ స్టార్ యాక్ట్ చేసి బిల్లా (డాన్ మూవీ రీమేక్) మూవీలో ప్రభాస్ స్టైల్ అందరినీ ఆకట్టుకున్నది. ఈ మూవీలో దాదాపు యాభై శాతానికి పైగా షూటింగ్ విదేశాల్లోనే జరిగింది. బడ్జెట్ కూడా భారీగానే పెట్టినట్టు టాక్. కానీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు.
విక్టరీ వెంకటేశ్ (షాడో)
ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే వారిలో విక్టరీ వెంకటేశ్‌ది ఫస్ట్ ప్లేస్. వెంకటేశ్, మెహర్ రమేశ్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ షాడో.. పాపం వెంకటేశ్.. అప్పటికే మూడు సినిమాలు తీసి ఫ్లాఫ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మెహర్ రమేశ్‌ను ఎలా నమ్మాడో తెలియదు గానీ.. చివరకు ఈ మూవీతో దెబ్బతిన్నాడు. ఈ మూవీలో కొంత భాగాన్ని విదేశాల్లో షూట్ చేశారు. ఇక ఆడియన్స్‌ను కామెడీ ట్రాక్ లోకి దింపాలని డైరెక్టర్ ఎంత ట్రై చేసినా అది ఫెయిల్ అయింది. ఓ చోట కాస్త కామెడీ పంపించే ప్రయత్నం చేసినా అది గబ్బర్ సింగ్ నుంచి కాపీ చేశాడనే విషయాన్ని ఆడియన్స్ ఇట్టె కనిపెట్టేశారు.
చిరంజీవి (భోళా శంకర్)
దాదాపు నాలుగు ఫ్లాఫ్ మూవీస్‌తో రికార్డు కొట్టిన మెహర్ రమేశ్ సుమారు తొమ్మిదేండ్ల గ్యాప్ తర్వాత చిరంజీవితో భోళా శంకర్ మూవీ (తమిళ సినిమా వేదాళం రీమేక్) చేశాడు. అప్పటికే ఫ్లాఫ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మెహర్ రమేశ్ బుట్టలో చిరంజీవి ఎలా పడ్డారనేది సస్పెన్స్. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన భోళా శంకర్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.
చిరంజీవి ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమవుతున్నది. కథలో బోరింగ్, సాగదీసే కంటెంట్, ఫైటింగ్స్ కంటిన్యూగా రావడం.. అవికూడా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోవడం మూవీకి పెద్ద మైనస్. ఇక ఫైనల్‌గా డైరెక్టర్ విషయానికి వస్తే ఆయన తీసిన మూవీల్లో రెండు సినిమాలు రీమేక్ చేసినవే. తన కెరీర్‌లో దిబెస్ట్ అని చెప్పుకునేందుకు ఒక్క మూవీ లేదు.
Also Read: హీరో Ravi Teja కోసమే ‘Bhola Shankar’ సినిమా తీసినట్టుగా ఉంది.. RGV ట్వీట్