- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెళ్లి పీటలెక్కిన మేఘా ఆకాశ్.. నా ఫేవరెట్ ఛాప్టర్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మేఘా- సాయి విష్ణు ప్రేమించుకుంటున్నారు. సీక్రెట్‌గా మెయింటేన్ చేసిన వీరు ఇటీవల విషయం పెద్దలకు చెప్పి ఒప్పించి వారి సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేయడంతో యూత్ అంతా షాక్ అయ్యారు. అయితే అప్పటి నుంచి మేఘా ఆకాశ్ తన పెళ్లి పనుల్లో బిజీగా మారిపోయింది. పలువురు సినీ సెలబ్రిటీలకు వెడ్డింగ్ కార్డులు కూడా పంచింది.
తాజాగా, మేఘా ఆకాష్ ప్రియుడు సాయివిష్ణులు పెళ్లి పీటలెక్కారు. సెప్టెంబర్ 13న చెన్నైలో పెళ్లి కాగా.. వీరి వెడ్డింగ్ రిసెప్షన్ 14న జరిగింది. అయితే ఈ శుభకార్యానికి తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా హాజరయ్యారు. చెన్నైలో జరిగిన మేఘా ఆకాశ్ రిసెప్షన్ వేడుకల్లో పలువురు సినీ తారలు, రాజకీయ నాయకులు కూడా పాల్గొని కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఇక ఆ ఫొటోలను షేర్ చేస్తూ ఈ అమ్మడు ఇన్‌స్టా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘ఇది నా జీవితంలో ఫేవరేట్ చాప్టర్’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రజెంట్ మేఘా ఫొటోలు వైరల్ అవుతుండగా.. అవి చూసిన వారంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.