- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గొప్ప మనసు చాటుకున్న చిరు.. ‘బలగం’ మొగిలయ్యకు ఆర్థికసాయం
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్‌లు ఏర్పాటు చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఇక ఇప్పుడు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు చిరు. ‘బలగం’ మొగిలయ్య తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీలు దెబ్బతినడంతో పాటు డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్ వంటి సమస్యలు రావడంతో ఆయన కంటి చూపు కూడా మందగించింది. అయితే విషయం తెలుసుకున్న చిరంజీవి మూవీ డైరెక్టర్ వేణుకు కాల్ చేసి.. ‘మొగిలయ్య కంటి చూపు కోసం ఎంత ఖర్చు అయినా సరే నేను చూసుకుంటా. ఆయనకు కంటి చూపు వచ్చేలా చేద్దాం’ అని భరోసా ఇచ్చినట్లు తెలిస్తోంది. దీంతో వెంటనే ఈ విషయాన్ని వేణు మొగిలయ్య దృష్టికి తీసుకువెళ్లారట. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ మొగిలయ్య దంపతులను ఇంటర్వ్యూ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read..
Sr.NTR: ఆ రోజుల్లో సీనియర్ హీరోల రెమ్యునరేషన్ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!